
today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు ధనం పుష్కలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. అద్భుతమైన రోజు. ఆఫీస్లో మంచి వార్తలు వింటారు. వ్యాపారులకు లాభాలు. ప్రశాంతమైన రోజు. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అశాంతితో ఉంటారు. స్నేహితులతో సహాయాలను, సహకారాలను అందుకుంటారు. విదేశీ విద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానానికి విజయం మీకు ఆనందం కలుగుతుంది. లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నాలు ముమ్మురం చేస్తారు. గోసేవ చేయడం మంచి ఫలితం వస్తుంది.
మిధునరాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సమస్యలు తీరుతాయి. సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాల్సిన సమయం. వ్యాపార కొత్త ఒప్పందం చేసుకోకండి. భాగస్వామి ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం చదవండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు సమస్యలు ఎదరవుతాయి. ఆఫీస్లో సమస్యలను అధిగమిస్తారు. ప్రేమికులకు ఆనందమైన రోజు. ఉద్యోగస్తులకు పై అధికారుల ద్వారా వత్తిడి ఉంటుంది. సహోద్యోగుల నుంచి ఇబ్బందులు. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. కాలభైరవాష్టకం పారాయణం చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు సహనంతో గడపాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రేమించే వారి నుంచి బహుమతులు అందుకుంటారు. సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టకండి. బెటర్ హాప్ నుంచి సర్ప్రైజ్ అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాల కోసం పెద్దల సలహాలు తీసుకుంటారు. వ్యాపారాలు మంచిగా నడుస్తాయి. శివ పూజ చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు స్పెక్యులేషన్ లాభాలను గడిస్తారు. సంతోషంతో కుటుంబ సభ్యులతో గడుపుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆనందం, సంతోషం కలుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి రోజు. సత్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు వేగంగా పనులు పూర్తిచేస్తారు. మీ ఆలోచన తీరును మార్చుకోవాలి. మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్తితి బాగుంటుంది. ప్రేమలో కఠినంగా ఉండండి. ప్రశాతంగా కుటుంబ వ్యవహారాలు పరిశీలించండి. జీవిత భాగస్వామితో గొడువ పడుతారు. శ్రీ చండీ దేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా మమూలుగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రీ గురుచరిత్ర పారాయణ చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. గ్రహాల చలనాల రీత్యా సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాతావరణం అర్థం కాని విధంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆఫీస్‌లో సంతోషంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆనందాన్ని పెంపొందించే పనులు చేస్తుంది. దుర్గాదేవి ఆరాధన చేయండి. మకర రాశి ఫలాలు : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. బయట ఆహారాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కానీ సాయంత్రానికి ధనం మీ చేతికి అందుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. అఫీస్‌లో సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు మంచిరోజు. సాయిబాబా దేవాలయం దర్శనం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు లేదా దేవాలయం దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. వ్యాపారాలు మమూలుగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాల్సిన రోజు. దత్తకవచం చదువుకోండి లేదా వినండి. మీన రాశి ఫలాలు : ఈరోజు భయం, ఆందోళన మీలో కలుగుతాయి. లాంగ్ రన్‌లో ప్రయోజనాల కోసం ధనాన్నిసరైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్నేహితుల నుంచి అనుకోని సర్‌ప్రైజ్ లభిస్తుంది. వివాహం అయిన వారికి సంతానం నుంచి శుభవార్తలు వింటారు. దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.