Home » Entertainment » Tollywood Hero Nikhil Clarifies On His Spy Movie Release
Entertainment

Jr NTR – Kalyan Ram : జూనియర్ ఎన్టీఆర్ కీ , కళ్యాణ్ రాం ఇద్దరికీ పిచ్చ కోపం తెప్పించిన హీరో నిఖిల్ !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: May 19, 2023, 2:05 pm
Advertisement

Jr NTR – Kalyan Ram : హీరో నిఖిల్ తెలుసు కదా. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయన తీసే సినిమాలన్నీ ఇక పాన్ ఇండియా సినిమాలే. ప్రస్తుతం ఆయన స్పై సినిమాలో నటించారు. అది కూడా పాన్ ఇండియా మూవీనే. బడ్జెట్ కూడా భారీగానే పెరిగింది. అయితే స్పై సినిమా స్టోరీ మరో సినిమా స్టోరీకి సంబంధం ఉందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నిజానికి స్పై సినిమా అనేది సుభాష్ చంద్రబోస్ జీవితం నేపథ్యంలో వస్తోంది. విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగానే విమాన ప్రమాదంలో చనిపోయారా? ఆయన ఎలా చనిపోయారు.. అనే దానిపై ఓ గూఢచారి చేసే సాహసం నేపథ్యంలో స్పై సినిమా తెరకెక్కింది. సినిమా టీజర్ చూస్తే కూడా అదే అనిపిస్తోంది.ఇదంతా పక్కన పెడితే నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమా తీస్తున్నారు. డెవిల్ సినిమా కథ కూడా అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించింది.కాకపోతే సుభాష్ చంద్రబోస్ ఉన్నప్పటి కాలం నాటి కథ అది. ప్రస్తుతం ఏం జరుగుతోంది అనే నేపథ్యం కాదు కానీ.. కథ మాత్రం అదే.

tollywood-hero-nikhil-clarifies-on-his-spy-movie-release

Advertisement

Jr NTR – Kalyan Ramm : కళ్యాణ్ రామ్ డెవిల్ కథ కూడా ఇదేనా?

స్పై సినిమా ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది. డెవిల్ సినిమా నేతాజీ ఉన్నప్పుడు ఏం జరిగింది అనే నేపథ్యంలో తీస్తున్నారు. అయితే.. డెవిల్ లో కూడా హీరో గూఢచారి. అక్కడ కూడా కథ సుభాష్ చంద్రబోస్ చుట్టూనే తిరుగుతుండటంతో ఒకే కథతో రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తుండటంతో ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే.. డెవిల్ సినిమాకు, మా కథకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సినిమా కథ వేరు.. ఈ సినిమా కథ వేరు అన్నారు. ఏది ఏమైనా.. రెండు సినిమాలు ఒకే కథతో.. కొన్ని రోజుల వ్యవధిలోనే రిలీజ్ అవుతుండటంతో ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి