Dolo 650 Tablets : కరోనా మహమ్మారి పుణ్యమాని డోలో 650 సూపర్ మెడిసిన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడా చూసినా ప్రతీ ఒక్కరు బోలో ‘డోలో’ అని అంటున్నారు. జ్వరం, కాస్త దగ్గు, ఒళ్లు నొప్పులు, ఇతరాలు ఏవి ఉన్నా వెంటనే డోలో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. అలా ప్రతీ ఇంటిలో ఒక నిత్యావసర సరుకుగా మారిపోయింది డోలో 650 ట్యాబ్లెట్. ఇకపోతే ప్రస్తుతం ఒమిక్రాన్, డెల్ట్రాకాన్ వేరియంట్స్ కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్యాబెట్ల్ యూసేజ్ ఇంకా బాగా పెరిగింది.ఈ డోలో 650 ట్యాబ్లెట్ ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉండే మాత్రని చెప్పొచ్చు.
ఇకపోతే ఈ కరోనా కాలంలో సోషల్ మీడియాలో డోలోపైన ఇటీవల కాలంలో బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ .. వంటి సామాజిక మాధ్యమాలన్నిటిలోనూ డోలో ట్యాబ్లెట్ కు సంబంధించిన వీడియోలను బాగా వైరలవ్ చేస్తున్నారు. డోలో ట్యాబ్లెట్ ను చాలా మంది ఓ గొప్ప ఔషధంగా భావిస్తున్నారు. కానీ, ఇది అత్యంత సాధారమైన మందు మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ఈ క్రమంలోనే మీమర్స్ ‘డోలో 650’ ప్రాముఖ్యత తెలిపేందుకుగాను రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కూడా. కొవిడ్ భయానక పరిస్థితులు ఇలానే కొనసాగితే..
కనుక మరి కొన్ని రోజుల్లో డోలో 650 ట్యాబ్లెట్స్‌ను మార్కెట్‌లోకి కేజీకి ఇన్ని రూపాయలు అనే విధంగా అమ్ముతారని మీమ్ క్రియేట్ చేశారు. ఒకప్పుడు జనాలు పోలో తినేవారని, ఇప్పుడు అందరూ డోలో తింటున్నారని చెప్తున్నట్లుగానూ మీమ్ క్రియేట్ చేశారు. సర్వరోగ నివారణి డోలో అని తెలిపే విధంగా ఓ చిత్రం రూపొందించి వైరల్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలోని వీడియోను రీ క్రియేట్ చేశారు. అందులో రజనీకాంత్ డోలోను స్టైల్ గా నోట్లో వేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.