Sharwanand : ఎంగేజ్మెంట్ అయినా ఇంకా పెళ్లి ఎందుకు అవ్వలేదు ? శర్వానంద్ గురించి బిగ్ న్యూస్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :16 May 2023,10:00 am

Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సూపర్ డుపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలను అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం డల్ పొజిషన్ లో ఉన్నాడు. ఒక్క హిట్టు కొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు. కథల విషయంలో బోల్తా కొడుతూ ఉండడంతో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాయి. ఆయన చేసిన ఓకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి.

Tollywood Young Hero Sharwanand Marriage news viral

Tollywood Young Hero Sharwanand Marriage news viral

ఇకపోతే శర్వానంద్ గత ఏడాది జనవరి లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తెలంగాణ హై కోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డితో ఆయనకు జనవరి లో ఎంగేజ్మెంట్ అయింది. హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ అయింది. అప్పటి నుండి వీళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏమీ రాకపోవడంతో వీళ్ళ పెళ్లి కాన్సిల్ అయిందని జనాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో వార్తలు అటు తిరిగి ఇటు తిరిగి శర్వానంద్ పెళ్లి కాన్సిల్ అయిందనే దాకా వచ్చింది.

Hero Sharwanand Gets Engaged !!

అయితే శర్వానంద్ పెళ్లి కాన్సిల్ కాలేదని, ఆయన ప్రస్తుతం ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని, ఆ సినిమా షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీ లో 45 రోజుల పాటు ఉన్నారని, అందుకే వాళ్ల పెళ్లికి సంబంధించిన అప్డేట్ ఎవ్వలేదని త్వరలోనే పెళ్లి డేట్ ఖరారు చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందని వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇక శర్వానంద్ పెళ్లి త్వరలోనే జరగబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి