Prabhas : పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ విడుద‌ల‌.. ప్ర‌భాస్‌కి ద‌క్క‌ని ఫ‌స్ట్ ప్లేస్, ప‌వ‌న్ ప‌రిస్థితి దారుణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ విడుద‌ల‌.. ప్ర‌భాస్‌కి ద‌క్క‌ని ఫ‌స్ట్ ప్లేస్, ప‌వ‌న్ ప‌రిస్థితి దారుణం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :22 September 2022,10:00 pm

Prabhas : ఇప్పుడు సౌత్ స్టార్స్ మానియా న‌డుస్తుంది. మ‌నోళ్లు బీటౌన్‌లోను కుమ్మేస్తుంటే అక్క‌డి హీరోలు నోరెళ్ల‌పెట్టి చూస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరోలుగా టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ హీరోలు అవతరించారు. ఈ జనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయ‌న త‌ర్వాత మిగ‌తా హీరోలు తమ స‌త్తా చూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే పాన్ ఇండియా కేటగిరీలో టాప్ లో ఉంది ఎవరు? టాప్ టెన్ స్టార్స్ ఎవరనే సర్వే నిర్వహించడం జరిగింది. ఇండియా వైడ్ గా ఆడియన్స్ అభిప్రాయాల ఆధారంగా టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్స్ చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోక‌మాన‌రు.

Prabhas : టాప్ లో వారే…

ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ఆగస్టు 2022కి గాను నంబర్ వన్ పాన్ ఇండియా స‌ర్వే నిర్వ‌హించ‌గా, ఇందులో స్టార్ గా కోలీవుడ్ హీరో విజయ్ ఎంపికయ్యారు. గత కొన్ని నెలలుగా విజయ్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ ఈ స్థాయి పాపులారిటీ సంపాదించడం విశేషం. ఇక రెండో స్థానం ప్రభాస్ కి దక్కింది.వ‌రుస ఫ్లాపులు వ‌చ్చిన కూడా ప్ర‌భాస్ టాప్‌లో ఉండ‌డం గ‌మ‌న‌ర్హం.ఇక ఆర్ ఆర్ ఆర్ తో తన రేంజ్ పెంచుకున్న ఎన్టీఆర్ 3వ స్థానం కైవసం చేసుకున్నారు. కాగా పుష్ప మూవీతో సంచలన విజయం నమోదు చేసిన అల్లు అర్జున్ కి ప్రేక్షకులు 4వ ర్యాంక్ కట్టబెట్టారు.

Prabhas Pan India Stars List Released

Prabhas Pan India Stars List Released

హిందీలో పుష్ప 100 కోట్లకు పైగా వసూళ్లతో అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న మరొక సౌత్ హీరో యష్. ఈ కన్నడ స్టార్ కెజిఎఫ్ 2 తో ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. దీంతో 5వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇక‌ రామ్ చరణ్ టాప్ ఫైవ్ నుండి కింద‌కు పడిపోయాడు. రామ్ చరణ్ కి 7వ ర్యాంక్ దక్కింది. మరో టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ కూడా ఈ లిస్ట్ లో అంతగా ప్రభావం చూపలేదు. మహేష్ కి ఆడియన్స్ 8వ ర్యాంక్ కట్టబెట్టారు. అనూహ్యంగా పవన్ కి ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు.ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి 6వ ర్యాంక్ ,సూర్యకు 9వ ర్యాంక్, అజిత్ కుమార్ కి 10వ ర్యాంక్ దక్కాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది