Trisha : నాకు అలా అస్సలు నచ్చదు..పెళ్లి మీద త్రిష సెన్సెషనల్ కామెంట్స్..?

Authored By mallesh | The Telugu News | Published on: October 11, 2022, 11:30 am

Trisha : స్టార్ హీరోయిన్ త్రిష తన వివాహం మీద సంచలన కామెంట్స్ చేసింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇటువంటి కామెంట్స్ చేసింది నిజంగా త్రిషనేనా అంటూ కొందరు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె అభిమానులు తన కామెంట్స్ విని ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన నటి వివాహం చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఉండాలని వారు కోరుకుంటే త్రిష స్టేట్మెంట్స్ విని వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

త్రిషతో కెరీర్ ప్రారంభించిన వారంతా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. మరికొందరు ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ ఈ బ్యూటీ మాత్రం నేటికి సినిమాలు చేస్తూ అవకాశాలను దక్కించుకుంటోంది. త్రిష అప్పట్లో 96 మూవీలో నటించి భారీహిట్ అందుకుంది. 96 మూవీలో విజయ్ సేతుపతి, త్రిష నటనకు గాను ఫ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రీసెంట్‌గా త్రిష పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మంచి విజయం సాధించింది.

Trisha comments on marriage

Trisha comments on marriage

Trisha : నా లైఫ్‌లో అలాంటిది చూడలేను

ఈ క్రమంలోనే సక్సెస్ మీట్‌కు వెళ్లిన ఈ అమ్మడుని చాలా మంది పెళ్లి ఎప్పుడని అడుగడంతో తీవ్ర నిరాశకు గురైందట.. ఈ సందర్భంగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు సరైన తోడు దొరికినపుడు నేనే చేసుకుంటాను. అయినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే వేరు. పెళ్లి ఇంకెప్పుడు చేసుకుంటావ్ అని అడుగడం వేరు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా లేరు. కొందరు విడాకులు తీసుకుని ఉంటున్నారు. పెళ్లి అయ్యాక విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదని’ స్పష్టం చేసింది.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp