Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాటతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. మహేశ్ బాబు పంచ డైలాగులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. థమన్ మ్యూజిక్ అందించగా కళావతి, మమ మహేశా సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా మహేశ్ గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు.
కాగా భిన్నమైన టాక్ తో మొదలైన సర్కారు వారి పాట తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి రూ.102.39 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం మహేశ్ ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో ఉందన్న విషయం తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ అతడు, ఖలేజా వంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్ అందుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఖలేజా సినిమాతో మహేష్ లోని కొత్త నటుడు బయటకు వచ్చాడు అనిపించింది. కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో సందడి చేయనున్నాడు. మహేశ్ తో స్క్రీన్ పంచుకోనున్నాడు. ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో ఓ పాత్రలో మరో హీరోని ప్రజెంట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో కూడా మరో హీరోకి స్కోప్ ఉండటంతో కొంత మందిని సంప్రదించాడట.. అయితే చివరికి నాచురల్ స్టార్ నాని ఈ పాత్రకు ఒప్పుకున్నట్లు సమాచారం. నాని ఇదివరకు మల్టీస్టారర్ చిత్రంలో నటించాడు. కాగా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ పండగ చేస్కుంటున్నారు. కాగా ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో మహేశ్ సినిమా ఉండనుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.