Mahesh Babu : త్రివిక్ర‌మ్ మ‌హేశ్ బాబు సినిమాలో మ‌రో హీరో.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : త్రివిక్ర‌మ్ మ‌హేశ్ బాబు సినిమాలో మ‌రో హీరో.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే..

 Authored By mallesh | The Telugu News | Updated on :21 May 2022,10:00 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట‌తో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ తో మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. మ‌హేశ్ బాబు పంచ డైలాగుల‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. థ‌మ‌న్ మ్యూజిక్ అందించ‌గా క‌ళావ‌తి, మ‌మ మ‌హేశా సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి. ట్రైల‌ర్ తోనే ఆక‌ట్టుకున్న ఈ సినిమా మ‌హేశ్ గ్లామ‌ర్, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు.

కాగా భిన్న‌మైన టాక్ తో మొద‌లైన సర్కారు వారి పాట తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి రూ.102.39 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశ‌గా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం మ‌హేశ్ ఈ మూవీ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ త్రివిక్ర‌మ్ తో ఉంద‌న్న విష‌యం తెలిసిందే. గ‌తంలో సూప‌ర్ స్టార్ తో త్రివిక్ర‌మ్ అత‌డు, ఖలేజా వంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అందుకోక‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. ఖ‌లేజా సినిమాతో మ‌హేష్ లోని కొత్త న‌టుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు అనిపించింది. కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో అద‌రగొట్టాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మ‌రో అప్డేట్ వైర‌ల్ అవుతోంది.

trivikram is another hero in mahesh babu movie now it is a estival for the fans

trivikram is another hero in mahesh babu movie now it is a- estival for the fans

ఈ సినిమాలో మ‌రో టాలీవుడ్ హీరో సంద‌డి చేయ‌నున్నాడు. మ‌హేశ్ తో స్క్రీన్ పంచుకోనున్నాడు. ఈ మ‌ధ్య‌కాలంలో త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఓ పాత్ర‌లో మ‌రో హీరోని ప్ర‌జెంట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో కూడా మ‌రో హీరోకి స్కోప్ ఉండ‌టంతో కొంత మందిని సంప్ర‌దించాడ‌ట.. అయితే చివ‌రికి నాచుర‌ల్ స్టార్ నాని ఈ పాత్ర‌కు ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. నాని ఇదివ‌ర‌కు మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టించాడు. కాగా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీంతో ఇద్ద‌రి హీరోల‌ ఫ్యాన్స్ పండ‌గ చేస్కుంటున్నారు. కాగా ఈ మూవీ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో మ‌హేశ్ సినిమా ఉండ‌నుంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది