Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమాను చేస్తున్నాడు. మహేష్ బాబు తో ఈయన గతంలోనే అతడు మరియు ఖలేజా సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసింది. ఆ రెండు సినిమాల ఫలితాలు ఏంటో కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో సినిమా ఖచ్చితంగా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అలవైకుంఠపురంలో సినిమా త్రివిక్రమ్ యొక్క చివరి సినిమా మళ్లీ అప్పటి నుండి సినిమా చేయలేదు. ఆయన నుండి సినిమా రాలేదు. ఇన్నాళ్లకు మహేష్ బాబుతో సినిమాను మొదలు పెట్టాడు. మహేష్ బాబు సినిమా మొదలయ్యిందో లేదో అప్పుడే త్రివిక్రమ్ తదుపరి సినిమా గురించిన చర్చలు మొదలయ్యాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రానా హీరోగా హిరణ్య కశ్యప అనే ఒక సినిమాను త్రివిక్రమ్ తీయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అదేంటి రానాతో గుణశేఖర్ ఈ సినిమాను తీస్తానంటూ అధికారికంగా గతంలోనే ప్రకటించాడు. సురేష్ బాబు నిర్మిస్తానంటూ ముందుకు వచ్చాడు కదా ఇప్పుడు త్రివిక్రమ్ ఈ టైటిల్ తో రానా హీరోగా సినిమా చేయడమేంటి అంటూ చాలా మంది అవాక్కవుతున్నారు. ఇదే సమయంలో గుణశేఖర్ నుండి ప్రాజెక్ట్ ని హైజాక్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ మరియు ఆయన సన్నిహిత నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రానాతో ఒక అద్భుతమైన పౌరాణిక చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా తీయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే గుణశేఖర్ రెడీ చేసిన హిరణ్య కశ్యప స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గుణశేఖర్ సన్నిహితులు మరియు అభిమానులు.. దయచేసి గుణశేఖర్ కి అన్యాయం చేయవద్దని త్రివిక్రమ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు గుణశేఖర్ చేస్తేనే తీస్తేనే బాగుంటాయి. కనుక మీరు ప్రయోగం చేసి అనవసరంగా మంచి ప్రాజెక్ట్ ని నాశనం చేయవద్దని కొందరు గుణశేఖర్ అభిమానులు త్రివిక్రమ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియాలో పుకార్లైతే షికార్లు చేస్తున్నాయి కానీ అసలు విషయం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.