Trivikram srinivas crazy news about trivikram mahesh movie
Trivikram Srinivas : టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలందరూ వెయిట్ చేస్తుంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, త్రివిక్రమ్ చేసిన మొదటి ఫిల్మ్ ‘నువ్వే నువ్వే’ తర్వాత మిగతా సినిమాలన్నీ దాదాపుగా స్టార్ హీరోలతోనే చేశారు. కాగా, ఆ కాంబినేషన్స్ మళ్లీ రిపీట్ ఎప్పుడవుతాయా అని ఎదురు చూస్తుంటారు. త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చే సినిమా అంటే సినీ అభిమానులకు విందు భోజనమే అని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, ఫన్నీ డైలాగ్స్, ఆలోచింపజేసే మాటలు, పాటలు, యాక్షన్ సీన్స్ ఇలా ఒక్కటేమిటీ ప్రతీ ఒక్కటి అందరినీ అలరించే విధంగా ఉంటాయి. ఇక మహేశ్-త్రివిక్రమ్ కాంబోకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు, ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలు కాగా, ఈ సారి రాబోయే హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబీ 28’పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.ఈ ఫిల్మ్‌లో మహేశ్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫైనల్ అయింది.
Trivikram srinivas crazy news about trivikram mahesh movie
కాగా, ఇందులో నెగెటివ్ రోల్ అనగా మెయిన్ విలన్ రోల్‌ను బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్లే చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నదని, ఇందుకు సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. త్రివిక్రమ్ ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఫిల్మ్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.