
tulasi family celebrates prem birthday in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 19 మార్చి 2022, ఎపిసోడ్ 584 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ బర్త్ డే రోజున ఏం చేయాలి అని అందరూ అనుకుంటారు. ఏం గిఫ్ట్ ఇద్దాం.. ఏం చేద్దాం.. ఏం వంటలు చేద్దాం అని తులసితో చర్చిస్తారు అందరు. నేను అయితే ప్రేమ్ కు ఇష్టమైన వంటలు చేస్తా అంటుంది అంకిత. మరోవైపు అనసూయ ఇంకేదో చెబుతుంది. ఇలా.. అందరూ తలో దిక్కు ప్రేమ్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. తులసి కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటుంది.
tulasi family celebrates prem birthday in intinti gruhalakshmi
ఇంతలో నందు అక్కడికి వచ్చి ఇంత రాత్రి పూట పడుకోకుండా ఏం చేస్తున్నావు తులసి అని అడుగుతాడు. దీంతో మన వాళ్లందరూ నా రూమ్ లో కూర్చొని ప్లాన్ చేస్తున్నారు అంటుంది. దేనికి ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతాడు నందు. దీంతో రేపు ఏంటో తెలియదా అని అంటంది. తెలుసు.. ప్రేమ్ బర్త్ డే అంటాడు. దీంతో ఓ గుర్తుందా అంటుంది. ఆ గుర్తు పెట్టుకోవాల్సి వస్తోంది.. అంటాడు నందు. ఇప్పటికి వాడికి పాతికేళ్లు వచ్చాయి కదా అంటాడు నందు. వాడి పసితనం ఇంకా మరిచిపోలేదు తులసి అని.. ప్రేమ్ చిన్ననాటి పరిస్థితులను గుర్తు చేస్తాడు నందు.
మరోవైపు ప్రేమ్ ఇంటికి వస్తాడు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఏం చేయలేదా.. ఎవ్వరూ లేరేంటి. అందరూ పడుకున్నారా అని అనుకుంటాడు ప్రేమ్. కాస్త నిరాశ చెందుతాడు. అస్సలు ఎవ్వరూ ఏం పట్టనట్టు ఉన్నారేంటి అనుకుంటాడు. తన రూమ్ లోకి వెళ్లి చూస్తే శృతి కూడా నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది.
దీంతో నువ్వు కూడా నిద్రపోయావా. నేను ఇంట్లోకి వచ్చేసరికే నువ్వు మంచం ఎక్కావంటే.. నన్ను నువ్వు కూడా పట్టించుకోవడం లేదన్నమాట.. అని అనుకుంటాడు ప్రేమ్. దిండు, దుప్పటి తీసుకొని సోఫా మీదికి ఎక్కి పడుకుంటాడు ప్రేమ్.
ఇంతలో ప్రేమ్ ను శృతి, మరోవైపు తులసి గమనిస్తుంటారు. కనీసం అమ్మ అయినా వచ్చి విషెస్ చెప్పలేదు అనుకుంటాడు. పోనీ.. నేను వెళ్లి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అని అనుకుంటాడు కానీ.. వద్దులే అని సోఫాలో పడుకుంటాడు.
ఇంతలో తులసి తన దగ్గరికి వచ్చి.. హ్యాపీ బర్త్ డే నాన్న అంటుంది. ప్రేమ్ అప్పటికే నిద్రపోతాడు. కావాలని ఇంట్లో వాళ్లంతా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.. అందుకే నీకు నేను బర్త్ డే విషెస్ చెప్పలేకపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
కట్ చేస్తే తెల్లారుతుంది. ఉదయమే అందరూ నిద్రలేస్తారు. ఉదయం కూడా ఎవ్వరూ ప్రేమ్ ను పట్టించుకోనట్టు నటిస్తారు. దీంతో ప్రేమ్ కు చిరాకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎవ్వరి దగ్గరిక వెళ్లినా.. ఎవ్వరూ తన బర్త్ డే గుర్తు లేనట్టుగానే నటిస్తారు.
దీంతో చిరాకు వచ్చి హాల్ లోకి వెళ్తాడు. అక్కడ లైట్స్ మొత్తం ఆఫ్ అయి ఉంటాయి. దీంతో కరెంట్ పోయిందేమో అని అనుకుంటాడు. మెల్లగా ఒక్కో లైట్ వెలుగుతుంటుంది. అక్కడ డెకరేట్ చేసి ఉండటం.. పక్కనే కేక్ ఉండటం చూసి ప్రేమ్ షాక్ అవుతాడు. అందరూ వచ్చి బర్త్ డే విషెస్ చెబుతారు. వామ్మో.. ఇంత పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేశారా అని ప్రేమ్ నోరెళ్లబెడతాడు.
మొత్తానికి ఘనంగా ప్రేమ్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.