tulasi requests nandu in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 5 సెప్టెంబర్ 2022, 729 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు తులసి, మరోవైపు సామ్రాట్ ఇద్దరూ మ్యూజిక్ స్కూల్ గురించి, ఆరోజు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో సామ్రాట్ తులసికి కాల్ చేద్దామనుకునేసరికి.. తులసి సామ్రాట్ కు మెసేజ్ పెడుతుంది. ఈరోజు నుంచి మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నాను అని తులసి సామ్రాట్ కు మెసేజ్ పెడుతుంది. దీంతో సామ్రాట్ కు కోపం వస్తుంది. అసలు తులసి ఏమనుకుంటోంది. తనకు తానే నిర్ణయం తీసుకుంటుందా అని సామ్రాట్ వెళ్లి బాబాయితో అంటాడు. తులసి గురించి అలా ఎందుకు ఆలోచిస్తున్నావురా. తప్పుగా ఆలోచించకు. తులసి ఎందుకు అలా చేసిందో ఆలోచించు అంటాడు బాబాయి.
tulasi requests nandu in intinti gruhalakshmi
నీ ఉక్రోషంలో ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న బాధ లేదు కానీ.. తులసి ఇక కనపడదు అనే బాధ కనిపిస్తోంది అంటాడు బాబాయి. తులసి గురించి నువ్వు డొంకతిరుగుడు మాటలు మాట్లాడకు.. అంటాడు బాబాయి. నువ్వు తులసిని ప్రేమిస్తున్నావు అంటాడు బాబాయి. దీంతో ప్రేమ లేదు దోమ లేదు అని చెప్పి సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు నా బట్టలు కనబడటం లేదు ఏమైంది అని తన సూట్ కేసును చూస్తుంది. ఇంతలో దివ్యను అడిగితే ప్రేమ్ అన్నయ్య నీ బట్టలు మోసుకెళ్తుంటే చూశాను అని చెబుతుంది దివ్య. దీంతో వెంటనే గార్గెన్ కు వెళ్లి చేస్తుంది శృతి. అక్కడ తన చీరలను ప్రేమ్ కింద పడేస్తాడు. నా చీరలన్నీ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. దీంతో నా రూమ్ లో ఉన్నాయి అందుకే తీసుకొచ్చా అంటాడు.
శృతికి బుద్ధి చెప్పేందుకు ప్రేమ్ ఆ చీరలను శృతి మళ్లీ ఉతికేలా చేస్తాడు. ఆ చీరల మీద నీళ్లు పోస్తాడు. దీంతో ఇవన్నీ నేను ఇప్పుడు ఉతకలేను అంటుంది శృతి. దీంతో వద్దు అన్నా వినడు ప్రేమ్. నీ ఒంట్లో కొవ్వుతో పాటు ఈగో కూడా తగ్గాలి అని చెప్పి వాటి మీద నీళ్లు పోసి వెళ్తాడు ప్రేమ్.
మరోవైపు సామ్రాట్ పక్కన తులసి లేకపోతే అక్కడ మనమే రాజులం అంటాడు నందు. వెంటనే మన ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిద్దాం అని అంటుంది లాస్య. ఇంతలో తులసి వాళ్లింటికి వస్తుంది. తులసిని చూసి లాస్య షాక్ అవుతుంది. నందు ఎవరు వచ్చారో చూడు అంటుంది లాస్య.
ఎవరు లాస్య అంటాడు నందు. మనిద్దరి విషయం సామ్రాట్ గారికి తెలిసేలా చేసిందే మీరు. అందుకే.. నేను కోరబట్టే తులసి ఆ విషయాన్ని మీ దగ్గర దాచింది అనే విషయం మీరు సామ్రాట్ గారికి చెప్పాలి అంటుంది తులసి. దీంతో ఇద్దరూ నవ్వుతారు. ఇది జోక్ ఆఫ్ ది ఇయర్ అంటుంది లాస్య.
తులసి చెబితే నమ్మని సామ్రాట్.. మనం చెబితే నమ్ముతారట. మమ్మల్ని మరీ ఇంతలా ఆడుకోకండి మేడమ్ అంటాడు నందు. తనను హేళన చేస్తారు నందు, లాస్య. దీంతో తులసి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వావ్.. నువ్వు నిజంగా మారిపోయావు నందు. మొదటి సారి తులసి నోరు మూయించావు అంటుంది లాస్య.
మరోవైపు సామ్రాట్ దగ్గరికి వెళ్తారు లాస్య, నందు. అక్కడికి నందు తులసితో రెండు మూడు సార్లు అన్నాడు సార్. సమయం చూసుకొని మీతో ఆ నిజం చెప్పేయమని అని అంటుంది లాస్య. మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన మాకు అస్సలు లేదు సార్ అంటాడు నందు.
దీంతో తులసి నా ఇగో మీద దెబ్బ కొట్టింది అంటాడు సామ్రాట్. నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా వైండప్ అయిందంటే నా పరువు పోయినట్టే కదా అంటాడు సామ్రాట్. ఇది ఒకరకంగా ఓటమే కదా అంటుంది లాస్య. నేను తట్టుకోలేకపోతున్నాను నందు అంటాడు సామ్రాట్.
మీరే నన్ను ఈ అవమానం నుంచి బయటపడేయాలి అంటాడు సామ్రాట్. దీంతో అర్జెంట్ గా మా ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలంటాడేమో అని అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
This website uses cookies.