will vasudhara reveal the truth behind her kidnap in guppedantha manasu
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 5 సెప్టెంబర్ 2022, 547 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చివరకు ఎలాగోలా వసుధర పరీక్ష రాస్తుంది. దీంతో రిషి కుదుటపడతాడు. జగతి, మహీంద్రా కూడా సంతోషిస్తారు. టెన్షన్ పడకు.. తను ఎగ్జామ్ బాగా రాస్తుంది కానీ.. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని రిషితో చెబుతాడు మహీంద్రా. ఆ తర్వాత ఎగ్జామ్ బాగా రాస్తుంది వసుధర. ఆ తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు వసు పనిచేసే రెస్టారెంట్ కు మహీంద్రా, జగతి, గౌతమ్ వస్తారు. మనం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే రిషి, వసు ఇద్దరి పెళ్లి చేసేద్దాం అంటాడు మహీంద్రా. ఇంతలో గౌతమ్ కాల్ మాట్లాడి వచ్చి అంకుల్ నేను ఒక విషయం ఆలోచించాను అంటాడు. ఏంటి అంటే వాళ్లకు చెప్పకుండానే రిషి, వసు పెళ్లి చేసేద్దాం అంటాడు గౌతమ్. మేము కూడా అదే అనుకుంటున్నాం అంటాడు మహీంద్రా.
will vasudhara reveal the truth behind her kidnap in guppedantha manasu
మరోవైపు ఎగ్జామ్స్ అయిపోయాయన్న ఆనందంలో పిల్లలతో కలిసి ఒప్పుల కుప్ప ఆట ఆడుతూ ఉంటుంది వసు. ఇంతలో అక్కడికి వస్తాడు రిషి. మీరేంటి ఇలా సడెన్ గా వచ్చారు అంటుంది. అసలు నీకేమైంది. నువ్వు ఎందుకు అలా అక్కడ పడి ఉన్నావు అని అడుగుతాడు రిషి. దీంతో నేను పరీక్ష రాయకుండా చేయాలని అనుకుంది ఎవరో కాదు సాక్షి అనే విషయం రిషి సార్ కు చెప్పకూడదు. అది నేనే తెలుసుకోవాలి అని అనుకుంటుంది వసుధర. ఈ విషయాన్ని మనసులో నుంచి తీసేశాను. ఎవరు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారో నాకు సరిగ్గా గుర్తులేదు అంటుంది వసు.
మరోవైపు రిషి, వసుధర ఇద్దరు ఫోటోలను ఫోన్ లో చూస్తూ ఈ జంట ఎంత బాగుందో కదా అని అనుకుంటాడు. ఇంతలో జగతి రావడంతో రా జగతి చూడు.. రిషిధారలు.. మంచి జంట కదా అంటాడు. ఇక్కడ పుత్రరత్నం చూడు మొహం ఎలా పెట్టాడో అంటాడు మహీంద్రా.
దీంతో అస్తమానం నా కొడుకును విమర్శిస్తే బాగోదు అంటుంది జగతి. హలో జగతి గారు పుత్రరత్నం నాకూ కొడుకే అంటాడు. ఆ తర్వాత సాక్షి వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదని దేవయానికి తెలుస్తుంది. దీంతో షాక్ అవుతుంది దేవయాని. వెంటనే సాక్షికి ఫోన్ చేస్తుంది.
నువ్వు ఏ పని చేసినా సరిగ్గా చేయవా అంటూ సాక్షిపై విరుచుకుపడుతుంది దేవయాని. నీలో పర్ ఫెక్షన్ లేదు. ఏ పనీ సరిగ్గా చేయవా. ముందు రిషి ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. రెండోసారి చాన్స్ వచ్చినా నువ్వు ఎంగేజ్ మెంట్ లో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నావు అని అంటుంది దేవయాని. నాకు మరో చిన్న అవకాశం దొరికినా చాలు ఆ సాక్షి, వసుధర ఇద్దరినీ విడదీస్తా అని మాటిస్తుంది సాక్షి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
This website uses cookies.