Home » Entertainment » Two Heroines Fight For Chiranjeevi
Entertainment

Chiranjeevi : ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ చిరంజీవి కోసం ఏకంగా కొట్టేసుకున్నారా..!

Authored By
Sam C
The Telugu News | Published on: October 20, 2022, 3:30 pm
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్ర‌భంజ‌నం. ఆయ‌న న‌ట‌న‌, డ్యాన్స్, ఫైట్స్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచిన చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. ఆయ‌న ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న చిరు రీసెంట్‌గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఈ సినిమాకి మోహన రాజా దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే చిరంజీవి నటిస్తోన్న మరో సినిమా మెగా 154. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే చిరంజీవిలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టిన సినిమాగా ఇంద్ర సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ నటన చూసి జనాలు ఫిదా అయిపోయారు.

Advertisement

2002లో రిలీజ్ అయిన ఈ సినిమాను బి గోపాల్ డైరెక్ట్ చేశారు . ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే క‌థానాయిక‌లుగా నటించారు. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ సీన్ చేసే సందర్భంలో ఇద్దరు హీరోయిన్స్ చిరంజీవి కోసం కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారట . అది స‌రదాగా. నిజానికి ఈ సినిమా లాస్ట్ లో ఇంద్రసేనారెడ్డి ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలట. ఆ హీరోయిన్ ఎవరు అయ్యి ఉంటే బాగుంటుందా అంటూ డైరెక్టర్ గోపాల్ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వెళ్లిన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ..నాతో పెళ్లి చేయమంటే ..నాతో పెళ్లి చేసినట్టు కధ రాయండి అంటూ ఓ రేంజ్ లో హంగామా చేసారట . ఈ విష‌యంలో చిరంజీవి కూడా ఏం మాట్లాడ‌లేక‌పోయార‌ట‌. ఈ క్రమంలో ఒక‌రిని త‌క్కువ చేసి మ‌రొక‌రిని పైకి లేపే ప్ర‌య‌త్నం చేయ‌కుండా జనాల మనుషులుగా చూపించాడు ద‌ర్శ‌కుడు.

two heroines fight for Chiranjeevi

Advertisement

Chiranjeevi : అంత ప‌గనా..

అయితే షూటింగ్ టైంలో మాత్రం అర్తి అగర్వాల్-సోనాలి బింద్రే చిరంజీవి నా మొగుడు అంటే నా మొగుడు అంటూ సినిమా కోసం ఫైట్ చేసుకున్నారట . ఈ విష‌యాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇక ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఖతర్నాక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఖతర్నాక్ గిఫ్ట్‌ను ఫ్యాన్స్‌కు అందించనుందట టీమ్. దీపావళి పండుగ రోజు వాల్తేర్ వీరయ్య నుంచి అదిరిపోయే రేంజ్‌లో ఓ టీజర్‌ రానుందట.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి