Pooja Hegde : పూజా మన కాజా..మరి రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ కదా..!

Authored By vamana sai | The Telugu News | Published on: April 16, 2022, 11:00 am

Pooja Hegde : ఇటీవలే తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే విజయ్ సరసన హీరోయిన్‌గా నటించింది. వాస్తవంగా పూజాకు ఇదేమి తమిళ డెబ్యూ సినిమా కాదు. కొన్నేళ్ళ క్రితమే తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

అయితే, అక్కడ నటించిన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో మళ్ళీ తమిళ సినిమాలలో అవకాశాలు దక్కలేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న పూజాకు అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ నుంచి ఏక కాలంలో అవకాశాలు వచ్చాయి. అయితే, బీస్ట్ సినిమా రిలీజ్‌కు ముందు మన టాలీవుడ్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ హడావుడి బాగానే జరిగింది. తెగ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక్కడ ఎక్కువగా అందాల ప్రదర్శనతో సందడి చేసిందీ అంటే హీరోయిన్ పూజా హెగ్డేనే. తెలుగులో ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అందుకే, భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు.

two pan indian movies are flop in pooja-hegde list

two pan indian movies are flop in pooja-hegde list

Pooja Hegde: పూజా రోల్‌కు ప్రాధాన్యం లేకపోయినా భారీ రెమ్యునరేషన్..!

ఈ ప్రమోషన్స్‌లో దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి చాలా ఓవర్‌గా చెప్పుకొచ్చాడు. పూజా మన కాజా..ఆమె లెగ్ పెడితే ఏ సినిమా అయినా హిట్టే.. ఆమె డేట్స్ కోసం వేయిటింగ్..ఇస్తే ఒక సినిమా చేసి హిట్ కొడతా..అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చేసినప్పుడే అందరూ రాధే శ్యామ్ సినిమా గురించి కామెడీగా సెటైర్స్ వేశారు. ఆ తర్వాత బీస్ట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో పూజా మన కాజా ఆమె నటిస్తే ఏ సినిమా అయినా హిట్ అన్న దిల్ రాజు మాటలను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంత కాజా అయితే, రాధే శ్యామ్..బీస్ట్ వంటి రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ ఎందుకవుతాయి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ..ఈ రెండు భారీ చిత్రాలలో పూజా రోల్‌కు ప్రాధాన్యం లేకపోయినా భారీ రెమ్యునరేషన్ మాత్రం అందుకుంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp