Pooja Hegde : ఇటీవలే తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే విజయ్ సరసన హీరోయిన్‌గా నటించింది. వాస్తవంగా పూజాకు ఇదేమి తమిళ డెబ్యూ సినిమా కాదు. కొన్నేళ్ళ క్రితమే తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
అయితే, అక్కడ నటించిన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో మళ్ళీ తమిళ సినిమాలలో అవకాశాలు దక్కలేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న పూజాకు అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ నుంచి ఏక కాలంలో అవకాశాలు వచ్చాయి. అయితే, బీస్ట్ సినిమా రిలీజ్‌కు ముందు మన టాలీవుడ్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ హడావుడి బాగానే జరిగింది. తెగ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక్కడ ఎక్కువగా అందాల ప్రదర్శనతో సందడి చేసిందీ అంటే హీరోయిన్ పూజా హెగ్డేనే. తెలుగులో ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అందుకే, భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు.
ఈ ప్రమోషన్స్‌లో దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి చాలా ఓవర్‌గా చెప్పుకొచ్చాడు. పూజా మన కాజా..ఆమె లెగ్ పెడితే ఏ సినిమా అయినా హిట్టే.. ఆమె డేట్స్ కోసం వేయిటింగ్..ఇస్తే ఒక సినిమా చేసి హిట్ కొడతా..అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చేసినప్పుడే అందరూ రాధే శ్యామ్ సినిమా గురించి కామెడీగా సెటైర్స్ వేశారు. ఆ తర్వాత బీస్ట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో పూజా మన కాజా ఆమె నటిస్తే ఏ సినిమా అయినా హిట్ అన్న దిల్ రాజు మాటలను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంత కాజా అయితే, రాధే శ్యామ్..బీస్ట్ వంటి రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ ఎందుకవుతాయి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ..ఈ రెండు భారీ చిత్రాలలో పూజా రోల్‌కు ప్రాధాన్యం లేకపోయినా భారీ రెమ్యునరేషన్ మాత్రం అందుకుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.