Mahesh Babu : ఉద‌య్ కిర‌ణ్ చేయాల్సిన అత‌డు సినిమా మ‌హేష్ బాబు చేశాడా… ఏం జ‌రిగింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : ఉద‌య్ కిర‌ణ్ చేయాల్సిన అత‌డు సినిమా మ‌హేష్ బాబు చేశాడా… ఏం జ‌రిగింది?

 Authored By sandeep | The Telugu News | Updated on :12 February 2022,3:30 pm

Mahesh Babu : మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం అత‌డు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులు ముఖ్యంగా.. గన్ చుడాలనుకోండి తప్పులేదు…కానీ బుల్లెట్ చుడాలనుకోవద్దు చచ్చిపోతారు. అనే డైలాగులు థియేటర్స్‌లో పేలాయి.‘అతడు’ చిత్రాన్ని అప్పట్లో దాదాపు రూ. 24 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 16. 5 కోట్లకు అమ్ముడు పోయింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.17.5 కోట్లు వసూళు చేసింది. మొత్తంగా ‘అతడు’ సినిమాను అమ్మిన దానికి వచ్చిన వసూళ్లను చూస్తే సక్సెస్ సాధించిందనే చెప్పాలి.

ఈ సినిమా క్యాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు నిర్మాతకు రూ. 8.5 కోట్ల వరకు లాస్‌ను మిగిల్చింది.అయితే అత‌డు చిత్రాన్ని మ‌హేష్ క‌న్నా ముందుగా ప‌లువురు హీరోల‌తో ప్లాన్ చేశాడు త్రివిక్ర‌మ్.నువ్వు నేను సినిమాతో పీక్స్ లోకి వెళ్ళిన ఉదయ్ కి ఈ సినిమా క‌థ చెప్ప‌డంతో మూవీ స్టొరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్రివిక్రమ్.. జయభేరి ఆర్ట్స్‌‌లో ఈ సినిమాని చేయాలని అనుకున్నారు. త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ ఇద్దరు అడ్వాన్స్‌‌లు కూడా తీసుకున్నారట కానీ షూటింగ్ టైంకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట ఉదయ్ కిరణ్. వెంట‌నే ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు ఈ క‌థ తీసుకెళ్లాడ‌ట‌. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ ప‌డుకోవ‌డంతో వెంట‌నే మ‌హేష్‌ని అప్రోచ్ అయ్యాడు.

Uday Kiran says no then athadu offer comes to mahesh babu

Uday Kiran says no then athadu offer comes to mahesh babu

Mahesh Babu : అత‌డు అలా మ‌హేష్‌కి వెళ్లింది..

సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.. పద్మాలయ స్టూడియో పైన ఈ సినిమాని చేద్దామని మహేష్.. త్రివిక్రమ్‌‌కు ఆఫర్ చేశారు. కానీ జయభేరి ఆర్ట్స్‌‌లో తన రెండో సినిమాకి కమిట్ అవ్వడంతో ఆ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. టీవీలో ఈ సినిమా హిట్ కావడంతో ‘మా’ టీవీ ఈ సినిమాను రూ. 7 కోట్లకు రెన్యూవల్ చేసుకున్నట్టు సమాచారం. దీంతో క్యాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ సినిమాకు శాటిలైల్ హక్కులు పెద్ద వరంగా మారాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ టీవీల్లో ‘అతడు’ సినిమా ఎపుడు వచ్చినా.. మంచి టీఆర్పీలే రాబడుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది