వకీల్ సాబ్ నుంచి అర్థరాత్రి 12 గంటలకి ఊహించని సర్‌ప్రైజ్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ ..!

Authored By vamana sai | The Telugu News | Updated on: January 1, 2021, 9:04 am

వకీల్ సాబ్ నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ కోసం టైం ఫిక్స్ చేశారు పవన్ కళ్యాణ్. మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. అయితే దసరా పండుగ సందర్భంగా వకీల్ సాబ్ నుంచి టీజర్ ని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ మేకర్స్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దీపావళి పండుగ కి తర్వాత క్రిస్మస్ కి వకీల్ సాబ్ నుంచి టీజర్ వస్తుందని ఆతృతగా ఎదురు చూశారు. కాని ఎదురు చూపే తప్ప అనుకున్న టీజర్ మాత్రం రాలేదు.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel Saab' featuring Power Star

దాంతో ఫ్యాన్స్ కి విసుగొచ్చి ఇక వకీల్ సాబ్ టీజర్ గురించి ఆశలు వదిలేసుకున్నారు. కాని రీసెంట్ గా వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ అవడం తో మళ్ళీ ఫ్యాన్స్ టీజర్ గాని లేదా మరేదైనా సర్‌ప్రైజ్ వస్తుందేమో అని ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా వకీల్ సాబ్ న్యూ ఇయర్ సందర్భంగా అర్థ రాత్రి 12 గంటలకి వస్తున్నట్టు వెల్లడించారు.

ఫ్యాన్స్ కి న్యూ ఇయర్‌ ట్రీట్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌.. ఆసక్తికర సందేశం |  pawan kalyan starrer vakeel saab new poster release for new years gift arj

ఇలా సర్‌ప్రైజ్ ని అనౌన్స్ చేసిన కొన్ని నిముషాలలోనే సోషల్ మీడియా మొత్తం షేకయి పోతోంది. నిముషాలు.. గంటలు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు.. ప్రేక్షకులు. మొత్తానికి వకీల్ సాబ్ నుంచి వచ్చేది ఖచ్చితంగా టీజర్ ఆ లేక ఇంకేదైనానా అన్నది పక్కా క్లారిటీ లేదు గాని వచ్చేది మాత్రం పక్కా అని తేలిపోయింది. చూడాలి మరి వకీల్ సాబ్ ఏం సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడో. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp