Unstoppable Show : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. మొదట్లో బాలయ్య యాంకర్‌గా షో వస్తుందని తెలిసి అంతా షాక్ అయ్యారు. బాలయ్య బాబు సినిమాల్లో డైలాగ్స్ బానే చెబుతారు. లైవ్‌లో మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతారు. ఏదైనా మాట్లాడాలంటే తడబడుతుంటారు. అలాంటిది అంత పెద్ద షోను బాలయ్యే ఏవిధంగా హ్యాండిల్ చేస్తారో అని అంతా భయపడ్డారు. కానీ అల్లు అరవింద్ నమ్మకాన్ని ఎన్‌బీకే నిలబెట్టారు. బాలకృష్ణ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు, మరోవైపు యాంకర్‌గా సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు.
ఆయన హోస్ట్‌గా వచ్చిన అన్ స్టాపబుల్ తొలి భాగం చాలా విజయవంతంగా సాగింది. ప్రస్తుతం రెండో పార్ట్ కొనసాగుతోంది. రీసెంట్‌గా పార్ట్ -2 తొలి అతిథిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ విచ్చేసి సందడి చేసిన విషయం తెలిసిందే. బాలయ్య తన వియ్యంకుడితో పాటు అల్లుడిని కూడా సరదాగా ఆటపట్టించారు. ఇక ఈ సీజన్ రెండో ఎపిసోడ్లో కుర్ర హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను ఆహ్వానించారు. ఇప్పటికే వీరు వచ్చి సందడి చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో తనకు నచ్చిన కుర్రహీరోలు వీరిద్దరే అని బాలయ్య స్వయంగా చెప్పడం గమనార్హం.
అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడారు. మీరెప్పుడు మా షోకు వస్తున్నారని బాలకృష్ణ అడుగగా మీరు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తానని త్రివిక్రమ్ చెప్పారు. అయితే, ఈ సందర్భంగా బాలకృష్ణ ఒక్కసారిగా ఆగి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుండా ఎవరిని తీసుకుని రావాలో మీకు బాగా తెలుసుగా అని అడిగారు. దీంతో ఒక్కసారిగా షోలో సందడి మొదలైంది. అంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందిందని.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకవడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. బాలయ్య షోకు పవన్ నిజంగా వస్తే ఈ సీజన్ కూడా గ్రాండ్ హిట్ అని టాక్ వినిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.