Upasana: చిరుతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. చిన్నప్పటి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని. ఉపాసనకి నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండోది. రామ చరణ్‌ని వివాహం చేసుకొని పదేళ్లు అవుతుంది. ఇటీవల వారు యానివర్సరీ జరుపుకోగా, సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు.
అయితే వీరు ఇప్పటికీ పిల్లలని ప్లాన్ చేయకపోవడం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాంచరణ్, ఉపాసన వివాహం 2012లో వైభవంగా జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ ఈ జంటకు ఇంకా సంతానం లేదు. ఇది వాళ్ళ వ్యక్తి గత విషయం అయినప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. మీడియా ముందు ఈ ప్రశ్న ఎదురైనా ఉపాసన దాటవేస్తూ వచ్చింది. ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఆశ్చర్య కరంగా తాను పిల్లలని కనడం గురించి కూడా సద్గురు వద్ద ఉపాసన ప్రశ్నించింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకుని పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. నా ఫ్యామిలీని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను.
చాలా మంది ప్రజలు నా లైఫ్ లో ఆర్ఆర్ఆర్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. మొదటి ఆర్.. నా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నారు.. రెండవ ఆర్.. రీ ప్రొడ్యూస్ (పిల్లలు కనగలిగే సామర్థ్యం), మూడవ ఆర్.. లైఫ్ లో నా రోల్.. వీటి గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు అంటూ సద్గురుకి తెలిపింది. దీనికి స్పందించిన ఆయన రీ ప్రొడ్యూస్ విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. ఒక వేళ మీరు కనుక పులి అయి.. మీ జాతి అంతరించిపోతోంది పిల్లల్ని కనండి అని చెప్పేవాడిని, కాని మనుషులు కనాల్సిన అవసరం లేదంటూ సద్గురు సరదాగా వ్యాఖ్యానించారు
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.