Upasana : నంద‌మూరి ప్ర‌ణ‌తిపై ఉపాస‌న కామెంట్.. అందుకేనేమో.. తెలిస్తే షాక్

Authored By mallesh | The Telugu News | Published on: March 28, 2022, 1:30 pm

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) ఈ సందర్భంగా సెలబ్రిటీ లోకం ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తోంది. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చెర్రీకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆచార్య మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ మెగా అభిమాన వర్గాలను ఫిదా చేస్తోంది.ఆర్ఆర్ఆర్ సక్సెస్ సంబరాల నడుమ ఈ బర్త్ డే వేదిక రావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

పలువురు సెలబ్రిటీలు, ప‌లువురు హీరోలు రామ్ చరణ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయితే ఈ మూవీ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై రికార్డులు సృష్టిస్తోంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ భారీ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టే పర్‌ఫార్‌మెన్స్ కనబర్చారు రామ్ చరణ్. మరో హీరోగా ఎన్టీఆర్ నటన సినిమాలో హైలైట్ అయింది.అలాగే ఆచార్య‌ మూవీలో చెర్రీ రోల్ కీలకంగా ఉంటుందట. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. హీరోయిన్ గా పూజ హెగ్డే న‌టించింది.

upasana comment on nandamuri Pranathi

upasana comment on nandamuri Pranathi

upasana : అందులో కీల‌క రోల్

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 29న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఉపాసన పెట్టిన ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త రామ్ చరణ్‌కి స్వీట్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ రేర్ ఫొటో షేర్ చేసింది ఉపాసన.ఈ ఫొటోలో ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, రామ్ చరణ్, ఉపాసన ఉన్నారు. రామ్ చరణ్‌ని ఎన్టీఆర్ కౌగిలిలో బంధించగా.. ఉపాస‌న ప్రణతిని హగ్ చేసుకుంది. ఈ ఫొటోతో ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య ఎంత చనువుందనేది స్పష్టమవుతోంది. పైగా మై స్వీటెస్ట్ ప్రణతి అని ఉపాసన పేర్కొనడం మెగా, నందమూరి అభిమానులను పండ‌గ చేస్కుంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp