Upasana Konidela : సమంతది నిజమైన ప్రేమ.. ఉపాసన సంచలన కామెంట్స్
Upasana Konidela : సమంత ఉపానస మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి వాటిపై సలహాలు ఇచ్చే యువర్‌లైఫ్ అనే మ్యాగజైన్, వెబ్ సైట్‌ను ఉపాసన ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యగజైన్‌కు ఉపసంపాదికురాలిగా సమంతను నియమించింది ఉపాసన. అలా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.
గత లాక్డౌన్‌లో ఈ ఇద్దరూ కలిసి వంటలు కూడా చేశారు. వెరైటీ ఇడ్లీని సమంత చేసింది. ఉపాసన టేస్ట్ చేసి మెచ్చుకుంది.ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్నాను. పూర్తిగా వెజిటేరియన్‌గా మారాను. అదికూడా సేంద్రియ వ్యవసాయం చేస్తూ. నా అవసరాలను నేను తీర్చుకుంటున్నాను. ఇలా అర్భన్ ఫార్మింగ్ చేస్తున్నాను అంటూ సమంత చెప్పింది.

Upasana Konidela On Relation With Samantha
Upasana Konidela : సమంత ప్రేమపై ఉపాసన
అలా ఉపాసన కూడా సమంత నుంచి ఎంతో నేర్చుకుంది.ఇక ఫిట్ నెస్‌లో భాగంగా సమంత జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను కూడా ఉపాసన తన మ్యాగజైన్ కవర్ పేజ్‌గా వేసింది. తాజాగా ఉపాసన సమంత గురించి చెప్పుకొచ్చింది.నేను తెలంగాణా బిడ్డను. సాధారణంగా మాంసం తింటుంటా. దసరా లాంటి వేడుకల్లో కూడా మాసం ఎక్కువగా నాన్ వెజ్ వండుతాం.
కానీ సమంత ఎడిట్ చేసిన ఆర్టికల్స్ చేశాక చాలా వరకు మాంసం తినడం తగ్గించా. సమంతలో సాయం చేసే గుణం ఉంటుంది. ఎన్నో విషయాల్లో నాకు హెల్ప్ చేస్తుండేది. సమంతది నిజమైన ప్రేమ అంటూ మెగా కోడలు ప్రశంసలు కురిపించింది. మొత్తానికి ఉపాసన అయితే సమంత ప్రేమ గురించి సర్టిఫికెట్ ఇచ్చింది.