Uppena : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్ శిష్యుడి బుచ్చిబాబు సానా. ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అలాగే యంగ్ బ్యూటి కృతిశెట్టి కూడా టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గేట్ ని రీచ్ అయిందని అంటున్నారు. మొత్తానికి ఉప్పెన మాత్రం మంచి సక్సస్ ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిందని చెప్పుకుంటున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి సుకుమార్ కూడా ఖచ్చితంగా ఉప్పెన సినిమా 100 కోట్ల సినిమా అవుతుందని ధీమాగా చెప్పుకొచ్చాడు.
uppena-director next movie story is also ready
తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సినిమా సుకుమార్ చెప్పినట్టున్నాగే 100 కోట్ల వసూళ్ళని రాబడుతుందని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా సక్సస్ మీద సుకుమార్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇదే నిర్మాతలతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా కూడా కమిటయినట్టు స్వయంగా బుచ్చిబాబు ఇంతక ముందే వెల్లడించాడు. బుచ్చిబాబు రెండవ సినిమా కూడా మైత్రీ వారితోనే ఉండగా భారీ బడ్జెట్ తో .. స్టార్ హీరో నటించబోతున్నాడని సమాచారం. కాగా బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా కథ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.
సుకుమార్ కూడా ఇలాంటి కథ ఇప్పటి వరకు సినిమా చేయలేదన్న మాట కూడా వినిపిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ప్రస్తుతం కథ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఒక స్టార్ హీరోకు కథను వినిపిస్తాడట. కాగా బుచ్చిబాబు కి టాలీవుడ్ లో ఉన్న అందరు హీరోలతో మంచి రాపో ఉంది. అందరితోనూ మంచి రిలేషన్ మేయింటైన్ చేస్తున్నాడు. మరి ఏ హీరోతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అయితే టాక్ మాత్రం బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.