Home » News » Revanth Reddy Shocking Comments On Cm Kcr And Modi
News

Revanth Reddy : మోదీ కేసీఆర్ ను లొంగదీసుకోగలడు కానీ నన్ను కాదు.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 17, 2021, 9:43 am
Advertisement

Revanth Reddy : రేవంత్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మామూలుగా ఉండదు. ఇతర పార్టీల నేతలకు వణుకు రావాల్సిందే. ఆయన చేసే విమర్శలు కూడా మామూలుగా ఉండవు. డైరెక్ట్ గా అనేయడమే. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లు అయినా తన వాగ్దాడితో కట్టిపడేసే తత్వం రేవంత్ రెడ్డిది.

Advertisement

revanth reddy shocking comments on cm kcr and modi

అందుకే.. తెలంగాణలో రేవంత్ రెడ్డికి అంత ఫాలోయింగ్. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాజీవ్ భరోసా యాత్ర చేస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈ సంధర్బంగా ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఓవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు సీఎం కేసీఆర్ పై, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Advertisement

తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన రైతు రణభేరి సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ..  కేసీఆర్ కు తన తప్పులు చూపించి లొంగదీసుకున్నారు. కేసీఆర్ ను లొంగ దీసుకున్నట్టు ప్రజల ఆత్మ గౌరవాన్ని లొంగదీసుకుంటావా? కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి యజమాని కాదు.. అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి పార్లమెంట్ కు ఎందుకు వెళ్లడం లేదు?

రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎందుకు వెళ్లడం లేదు.. అంటూ ప్రశ్నిస్తున్న గాడిదలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియదా? కేసీఆర్, మోదీ.. ఇద్దరూ తోడు దొంగలే. వాళ్ల భరత పట్టడానికే ఈ యాత్రను ప్రారంభించా. కేసీఆర్ ను గొయ్యి తీసి పాతి పెడుతా. పేదల భూములు లాక్కుంటున్న కేసీఆర్.. నీ భూమిని 25 లక్షలకు ఇస్తావా? నేను 48 గంటల్లో డబ్బు చెల్లిస్తా? నీ భూములు మాత్రం ఉండాలి కానీ.. పేదల భూములను మాత్రం లాక్కుంటారా? ఈ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే.. మున్ముందు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా.. ఉప్పెన సృష్టిస్తా.. ఉప్పెనలా వస్తా? కేసీఆర్ ను కప్పేస్తా? అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

త్వరలో నిర్వహించే పాదయాత్రకు అధిష్ఠానం నుంచి అనుమతి తీసుకొనే నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి