Home » Entertainment » Uppena Heroine Krithi Shetty Smart Selection Of Movies
Entertainment

Krithi Shetty : ఉప్పెన బ్యూటీ బాగా స్మార్ట్‌ గురూ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది

Authored By
aruna
The Telugu News | Published on: August 8, 2022, 1:40 pm
Advertisement

Krithi Shetty : ఉప్పెన సినిమా కు కమిట్‌ అయిన సమయంలో కృతి శెట్టి టీనేజర్‌ అనే విషయం తెల్సిందే. ఇప్పుడు ఆమె 18 ఏళ్లకు పైగా వయసు అమ్మాయి అయ్యింది.. కాని మొన్నటి వరకు ఆమె చిన్న అమ్మాయే.. అయినా కూడా ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు వచ్చిన ఆఫర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పలు సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొన్ని మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

Advertisement

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కృతి శెట్టి కి పారితోషికం అమాంతం పెరిగింది. గత సంవత్సరం ఉప్పెన విడుదల అయిన వెంటనే కోటి రూపాయలకు తన పారితోషికంను పెంచేసింది. ఇప్పుడు ఆమె పారితోషికం రెండు కోట్లు.. నిజంగానే రెండు కోట్లుగా ఆమె సన్నిహితులు అంటున్నారు. అయినా కూడా ఆమె కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా వరుసగా పిలుపు వస్తున్న నేపథ్యంలో సౌత్‌ లోనే అత్యంత భారీ హీరోయిన్‌ గా.. బిజీ హీరోయిన్‌ గా ఈ అమ్మడు పేరు దక్కించుకుంది.

Uppena heroine Krithi Shetty smart selection of movies

Advertisement

ఈ సమయంలో కృతి చాలా స్మార్ట్‌ గా ఆలోచిస్తుంది. కథ విషయంలో కాస్త సీరియస్ గా ఉండటంతో పాటు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఇటీవల ఈ అమ్మడికి హిందీ నుండి రెండు మూడు ఆఫర్లు వచ్చాయట. పారితోషికం సౌత్‌ లో ఇచ్చినంత ఇచ్చేందుకు సిద్ధం అయ్యారట. కాని హిందీలో కంటే సౌత్ లో అది కూడా తెలుగు లో ఎక్కువగా సినిమాలు చేయాలని ఆమె భావిస్తుందట. అందుకు కారణం హిందీలో స్టార్ హీరోయిన్‌ అవ్వడం దాదాపు అసాధ్యం. అందుకే తెలుగు లో నెం.1 హీరోయిన్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని స్మార్ట్‌ గా ఆలోచించి హిందీ ఆఫర్లను తిరష్కరించిందట. ఇలా ఆలోచించక చాలా మంది హీరోయిన్స్ మంచి కెరీర్‌ ను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. కృతి జోరు చూస్తుంటే ముందు ముందు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి