Urvashi Rautela : టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలా మధ్య ఎఫైర్ సాగిందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఎఫైర్ విషయం పక్కకు వెళ్లి ఇప్పుడు వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం నడుస్తుంది. పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత వివాదాలు ఆ ఇద్దరి మధ్య ముసురుకున్నాయి అని అంటున్నారు. గడిచిన నెలన్నరగా జరుగుతున్న ఇద్దరి మధ్య చర్చకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా ఆమె.. ‘నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. నేనేం చెప్పాను..? ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. సారీ. ఐయామ్ సారీ’ అని చేతులుజోడించి విన్నవించుకున్నట్టు పలు వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.
సారీ చెప్పలేదు..
అందరు పంత్‌కే సారే చెప్పిందని అనుకున్నారు. కాని ఆమె మాట మార్చి మళ్లీ కథ మొదటికి వచ్చిందా అనేలా అనుమానాలు పెంచింది. అయితే తాజాగా ఊర్వశి మాట మార్చి… ‘నేను సారీ చెప్పింది ఆర్పీకి కాదు..నా ఫ్యాన్స్‌కు’ అంటూ షాక్ ఇచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఊర్వశి కనిపించింది. మొదటి మ్యాచ్ లో రిషభ్ ను ఎంపిక చేయలేదు. రెండో మ్యాచ్ లో అతడు ఆడినా విఫలమయ్యాడు.
ఇదే క్రమంలో ఊర్వశి.. పాకిస్తాన్ యువ క్రికెటర్ నసీమ్ షా తో ప్రేమలో పడ్డట్లు ఓ వీడియో వైరల్ అయింది. కానీ ఇది ఎడిటెడ్ వీడియో అని ఆమె తేల్చి చెప్పింది. కాగా,కొద్ది రోజుల క్రితం ‘కొందరు క్రేజ్, పాపులారిటీ కోసం ఏమైనా చేస్తారు. భగవంతుడు వారిని చల్లగా చూడాలి’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు రిషబ్ పంత్ . దీనికి ప్రతిగా ‘బ్యాట్ బాల్‌తో ఆడుకో తమ్ముడూ. రక్షాబంధన్ శుభాకాంక్షలు’ అని కౌంటర్ ఇచ్చింది ఊర్వశి. చూస్తుంటే వీరిద్దరి మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించేలా లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.