
radha and Vijayashanti fight topic in tollywood
Vijayashanti : ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర తారలలో విజయశాంతి, రాధ తప్పక ఉంటారు. వీరి నటనతో పాటు డ్యాన్స్ అదుర్స్ అనే చెప్పాలి. చిరంజీవితో కలిసి పోటీ పడి డ్యాన్స్ చేసే హీరోయిన్స్‌లో ఈ ఇద్దరి పేర్లు తప్పక ఉంటాయి. దీని వల్లనో ఏమో కాని అప్పట్లో రాధ, విజయశాంతిలకు చిరంజీవి సరసన నటించే అవకాశాలు ఎక్కువగా దొరికేవి. అయితే చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే.. రాధా – చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా వచ్చేసేది. ఈ ఇద్దరు హీరోయిన్స్‌తో చిరంజీవి చేసే సినిమాలకు మంచి ఆదరణ ఏర్పడడంతో నిర్మాతలు సైతం హీరోయిన్స్ వెనక పడుతుండేవారట.
విజయశాంతి డేట్స్ ఖాళీగా లేకపోతే రాధ డేట్స్, రాధా డేట్స్ ఖాళీగా లేకపోతే విజయశాంతి డేట్స్ తీసుకునే వాళ్లట నిర్మాతలు. ఈ క్రమంలో ఇద్దరు హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ కూడా నడిచేదని చెబుతుండేవారు. విచిత్రం ఏంటంటే చిరుకు జోడిగా ఈ ఇద్దరు కలిసి కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే కాలక్రమంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సూపర్ హిట్ కొట్టారు. దీంతో విజయశాంతికి లేడి సూపర్ స్టార్ బ్రాండ్ దక్కింది.ఇక రాధా పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా కాగా, ఆమె కూతుళ్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కాని వారు పెద్దగా అలరించలేకపోయారు.
radha and Vijayashanti fight topic in tollywood
అయితే అప్పట్లో విజయశాంతి. రాధ మధ్య జరిగిన కోల్డ్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉండేది. ఇక విజయశాంతి చాలా రోజుల తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆచార్య చిత్రంతో చివరగా పలకరించిన చిరు దసరాకి గాడ్ ఫాదర్‌తో పలకరించబోతున్నాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.