vadinamma 13 november 2021 full episode
Vadinamma 13 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 నవంబర్, 2021, శనివారం 699 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనాథను దత్తత తీసుకోవాలని లక్కీ.. రఘురామ్ కు సలహా ఇవ్వడంతో రఘురామ్ కు కోపం వస్తుంది. చూడండి.. నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. నా ముగ్గురు బిడ్డలకు ఇంకో ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వాళ్లు కూడా నా బిడ్డల్లాంటి వాళ్లే. ఈ ఇంట్లో దత్తత తీసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. వాడి తరుపున నేను క్షమాపణ కోరుతున్నాను. మీరు వెళ్లండి.. అని చెబుతాడు రఘురామ్.
vadinamma 13 november 2021 full episode
అన్నయ్య.. ఒక్క నిమిషం.. అంటాడు లక్కీ. నేను వాళ్లను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అన్నయ్య. ముందే నేను చెబితే వద్దంటావని పిలవలేదు. అనవసరంగా వాళ్లను పంపించేశావు. మీ అన్నయ్య, వదిన మీద నీకు ఉన్న ప్రేమకు థ్యాంక్స్ రా. ఒకవేళ నిజంగా అనాథను దత్తత తీసుకోవాలనుకుంటే.. నేను, మీ వదిన వెళ్లి అనాథాశ్రమానికి వెళ్తామురా.. అంటాడు రఘురామ్. ఏరా లక్ష్మణ్.. నిజంగా మీ అన్నయ్య మీద నీకు జాలి ఉందా? అనాథను దత్తత తీసుకోవాలని అంటుంది నువ్వేనా అంటుంది రాజేశ్వరి. నిజంగా మీ అన్నయ్య గురించి ఆలోచించేవాడివి అయితే ఇలా దత్తత గురించి మాట్లాడవురా.. నీ బాబును తీసుకొచ్చి పెద్దోడి చేతుల్లో పెట్టేవాడివిరా అంటూ లక్ష్మణ్ కు బుద్ధి చెబుతుంది రాజేశ్వరి.
పోనీలే అమ్మ.. వాడు ఏదో నా గురించి ఆలోచించి అలా చేశాడు అంటే. వాడు నీ గురించి ఆలోచించలేదురా. వాడి పెళ్లాం గురించి ఆలోచించి ఇలా మాట్లాడుతున్నాడు అంటుంది రాజేశ్వరి. అవును అమ్మా. అందులో తప్పేంటి. తెల్లవారితే చాలు అన్నయ్య బాబు వెంట పడుతున్నాడు. బాబు కనబడితే చాలు చెప్పాపెట్టకుండా ఎత్తుకుపోతున్నాడు. కన్నతల్లి దగ్గర ఉండే అవకాశం కూడా ఇవ్వడం లేదు.. పిచ్చిది ఏమనలేక ఏడుస్తూ బిక్కమొహం పెట్టుకొని కూర్చుంటోంది.. అంటాడు లక్ష్మణ్.
అమ్మ.. తమ్ముడిని ఏమనకు. వాడు అలా ఆలోచించడానికి కారణం నేనే కదా అంటాడు రఘురామ్. నీ బిడ్డ మీద వాడికి హక్కు ఎక్కడుందిరా. ఇప్పుడే వెళ్లి వాడికి నిజం చెప్పేస్తాను అంటుంది రాజేశ్వరి. దీంతో వద్దమ్మా. అప్పుడు సీత చేసిన త్యాగానికి అర్థం ఏముంటుందమ్మా అంటాడు రఘురామ్. ఎప్పటికీ ఆ నిజం.. బయటికి రాకూడదు అంటాడు రఘురామ్.
సిరి, సీత ఇద్దరూ గుడికి వెళ్తారు. బావకు రిషి గురించి చెప్పినప్పుడు బావ.. రిషి గురించి ఎక్కడ బయటపెడతాడోనని భయపడ్డాను. కానీ.. బావ అలా చేయలేదు. నేను చేసిన త్యాగాన్ని గుర్తించాడు అంటుంది సీత. తన తప్పును కూడా ఒప్పుకున్నాడు బావ.. అని సిరితో అంటుంది సీత. బాబును త్యాగం చేసినవ్.. కానీ.. శైలూ నిన్ను అర్థం చేసుకొని నీ బిడ్డను నీకు ఇస్తుందేమో అంటుంది సిరి.
వద్దు సిరి.. బాబు నా కళ్లముందు ఉంటే చాలు. ఇప్పుడు శైలూ నుంచి బాబును తీసుకోవడం కరెక్ట్ కాదు.. అంటుంది సీత. మరోవైపు పార్వతి, దుర్గ ఇద్దరూ కలుస్తారు. రఘురామ్ అన్నయ్య రిషి గాడిని చంకన వేసుకొని పెత్తనాలు చేస్తున్నాడు కదా అంటుంది దుర్గ. ఇప్పుడు ఏమైందో తెలుసా? లక్ష్మణ్ ఒక అనాథను దత్తత తీసుకొమ్మని చెప్పాడు అని పార్వతితో చెబుతుంది. దీంతో పార్వతి ఫుల్ ఖుషీ అవుతుంది.
మరోవైపు రఘురామ్ పొలం వద్ద ఉండగా.. జనార్ధన్ వచ్చి ఏంటి రఘురామ్ ఈ వయసులో కూడా ఎక్కువ సంపాదిస్తున్నావు. దేని కోసం.. అంటూ దెప్పిపొడుస్తాడు. నీకు పిల్లలు కూడా లేరు కదా అంటాడు. ఇంతలో భరత్ ఇంటికి వచ్చి లక్ష్మణ్ పై ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడండి.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.