
vadinamma 18 november 2021 full episode
Vadinamma 18 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 నవంబర్, 2021 గురువారం ఎపిసోడ్ 703 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తానికి భరత్, లక్ష్మణ్ పోట్లాడుకుంటారు. అన్నదమ్ముల మధ్య వైరం పెరుగుతుంది. మొన్నటి వరకు సంతోషంగా ఉన్న అన్నదమ్ములు అందరూ విడిపోతారు. దీంతో రఘురామ్, సీతకు ఏం చేయాలో అర్థం కాదు. భరత్.. కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. లక్ష్మణ్ కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు.మరోవైపు జనార్ధన్.. మళ్లీ ఏదో ప్లాన్ వేస్తాడు. ఇందాకటి నుంచి నా కుడి కన్ను అదురుతోంది అంటాడు లింగంతో. అయితే.. శుభవార్త వింటావు బావ అంటాడు. ఇంతలో మీ నాన్న గారికి ఫోన్ చేయ్ అని లక్ష్మణ్ అంటాడు.
vadinamma 18 november 2021 full episode
దీంతో వెంటనే శైలూ ఫోన్ చేస్తుంది. డాడీ.. నేను మీ ఇంటికి రావచ్చా అని అడుగుతుంది. ఇది నీ ఇల్లు అమ్మా రావచ్చా అని అడగడమేంటమ్మా. అలా అడిగితే మీ నాన్నను అవమానించినట్టే అమ్మా అంటుంది. నా శైలూ ఎప్పుడ ఫోన్ చేసినా గాలిలో ఎగురుతున్నంత ఆనందంగా ఉంటుంది అంటాడు.అల్లుడు గారు కూడా వస్తున్నారా అంటాడు జనార్ధన్. ఆయన ఫోన్ చేయమంటేనే చేస్తున్నాను అంటుంది. దీంతో జనార్ధన్ ఖుషీ అవుతాడు. అన్నయ్య ఓ నాలుగు రోజులు శైలూ ఇంటికి వెళ్లొస్తాం అంటాడు లక్ష్మణ్. దీంతో రఘురామ్, సీత షాక్ అవుతారు. నువ్వు జనార్థన్ ఇంటికి వెళ్తున్నావా? అని షాక్ అవుతారు.ఎప్పుడూ లేనిది ఇప్పుడు అత్తారింటికి వెళ్లడం ఏంట్రా అని అంటుంది సీత. ఇప్పుడు ఎందుకురా. వద్దురా.. అక్కడికి అయితే వద్దు అంటాడు రఘురామ్. ఎందుకు వెళ్లొద్దు బావ గారు అంటుంది శైలూ. జనార్ధన్ ఇప్పటికే మన కుటుంబానికి చాలా చెడు చేశాడు. నాకైతే నువ్వు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు అంటాడు రఘురామ్.
ఇప్పుడు నీకు అంత పెద్ద సమస్య ఏం వచ్చిందని పుట్టింటికి వెళ్తున్నావు శైలూ అంటుంది సిరి. నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని కొందరు చూస్తున్నారు అంటుంది శైలూ. వద్దు.. దీని గురించి పెద్దగా డిస్కషన్ వద్దు. నేను పుట్టింటికి వెళ్లాలి అనుకోవడం తప్పా అంటుంది శైలూ.ఇంతలో జనార్ధన్.. రఘురామ్ ఇంటికి వస్తాడు. కూతురును దగ్గరుండి పుట్టింటికి తీసుకెళ్లడం మర్యాద. అందుకే వచ్చాను అంటాడు జనార్ధన్. అత్తారింటికి వెళ్లడానికి అన్నయ్య పర్మిషన్ తీసుకుంటున్నావేమో అనుకున్నా. కానీ.. నిర్ణయం తీసేసుకున్నావన్నమాట అంటుంది సీత.
ఇది కూడా నీ ప్లాన్ ఏనా జనార్ధన్.. అని అడుగుతాడు రఘురామ్. నీ జోరు సాగినంత కాలం ఎగిరిపడ్డావు. రోజులన్నీ ఒకేలా ఉండవు రఘురామ్. అమ్మా ఇంకేంటి చూస్తున్నావు. నా మనవడిని తీసుకురా.. ఇంటికి వెళ్దాం అంటాడు జనార్ధన్. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.నా వల్లనే ఇదంతా జరిగింది అని భరత్ బాధపడుతాడు. సిరికి చెప్పి బాధపడతాడు భరత్. కట్ చేస్తే శైలూ, లక్ష్మణ్.. జనార్ధన్ ఇంటికి వెళ్తారు. నాన్నా రిషి నా బంగారు కొండరా నాన్నా.. అంటూ శైలూ తల్లి రిషిని ఎత్తుకుంటుంది. రండి.. లోపలికి రండి అని చెబుతుంది.
మరోవైపు రిషి లేడని దిగులుతో ఉంటాడు రఘురామ్. సీత వెళ్లి ఏమైంది బావా అని అడుగుతుంది. రిషి గుర్తుకొస్తున్నాడా అంటుంది. నువ్వు వాడిని మరిచిపోయావా? అంటాడు. నాకు ఎందుకు చేతగావట్లేదు సీత అంటాడు. నేను రిషిని అస్సలు మరిచిపోలేకపోతున్నాను అంటాడు రఘురామ్. తప్పదు బావా మరిచిపోవాలి అంటుంది సీత.
రిషి బర్త్ డే రోజు పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తాడు జనార్ధన్. ఈరోజు రిషి బర్త్ డే కదా.. మీరు తప్పకుండా రండి అని భరత్ కు ఫోన్ చేస్తాడు లక్ష్మణ్. అన్నయ్యకు మాత్రం చెప్పొద్దు. అన్నయ్య ఈ ఫంక్షన్ కు రావద్దు అంటాడు లక్ష్మణ్. ఆ తర్వాత జనార్ధన్.. రఘురామ్ కు ఫోన్ చేసి.. మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాను. నువ్వు ఫంక్షన్ కు వచ్చేదే లేదు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.