YS Jagan : ఆ మూడు జిల్లాల్లో వైసీపీని దెబ్బతీసిన అంశమిదే..!

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ విక్టరీ పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఆ మూడు జిల్లాల్లో మాత్రం అధికార వైసీపీకి దెబ్బ తగిలినట్టే కనబడుతున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో టీడీపీ పుంజుకున్నది. కాగా, అలా వైసీపీని దెబ్బతీసిన అంశమేమిటంటే..ప్రస్తుతం ప్రతిపక్ష పోషిస్తున్న టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి అధికార పక్షంగా మారాలనుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు, భావినేత నారా లోకేశ్, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నారు.

YS Jagan : గతంతో పోలిస్తే బాగా పుంజుకున్న టీడీపీ..

ys jagan 3 capitals issue seems to benefit tdp

ఈ క్రమంలోనే మూడు రాజధానుల అంశాన్ని విమర్శిస్తూ అమరావతియే రాజధాని అని అంటున్నారు. అమరావతి రాజధాని అన్న విషయమై కట్టుబడి ఉన్నామని ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు ప్రకటన కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ బలపడినట్లు కనబడుతున్నది. కృష్ణా జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీడీపీ ఒక రకంగా గెలిచినట్లే అని చెప్పుకోవచ్చు. జగ్గయ్యపేటలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీ చాలా గట్టి పోటీనిచ్చింది. కొండపల్లి మున్సిపాలిటీలోనూ టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తంగా కృష్ణా జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుందని చెప్పడానికి ఆ పార్టీ గెలిచిన స్థానాలు చాలు.

గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం గమనార్హం. మొత్తంగా మూడు రాజధానుల అంశం టీడీపీకి లాభం చేకూర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ ఇంకా బాగా పుంజుకునే చాన్సెస్ ఉన్నాయి. ఫలితంగా అధికార వైసీపీకి భవిష్యత్తులో గట్టి దెబ్బ తగిలే చాన్సెస్ ఉండొచ్చు. చూడాలి మరి.. ఈ మూడు జిల్లాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా అధికార వైసీపీ ఎలా మార్చుకుంటుందో మరి..

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago