Vaishnav Chaitanya : రూ.700ల కోసం రాత్రిళ్ల‌లో ఆ ప‌ని చేశా.. నా బాధ‌ల‌ని చూడ‌లేక అమ్మ ఏడ్చింద‌న్న బేబి హీరోయిన్

Authored By Ramu | The Telugu News | Published on: March 15, 2024, 12:00 pm
  •  Vaishnav Chaitanya : రూ.700ల కోసం రాత్రిళ్ల‌లో ఆ ప‌ని చేశా.. నా బాధ‌ల‌ని చూడ‌లేక అమ్మ ఏడ్చింద‌న్న బేబి హీరోయిన్

Vaishnav Chaitanya  : బేబి సినిమాలో హీరోయిన్‌గా న‌టించి ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన వైష్ణ‌వి చైత‌న్య‌. యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తూ మెరిసిన తెలంగాణ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య.. ‘బేబీస‌తో సంచ‌ల‌న విజ‌యం అందుకుంది. ఈ సినిమాలో రెండు పార్శ్వాలు కలిగిన పాత్రలో వైష్ణవి నటనకి అంద‌రి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ‘అల వైకుంఠపురములో’, ‘వలిమై’లో హీరోల చెల్లి పాత్రలో క‌నిపించి సంద‌డి చేసిన వైష్ణ‌వికి బేబి సినిమాలో హీరోయిన్‌గా న‌టించే అదృష్టం ద‌క్కింది. వ‌చ్చిన అవ‌కాశాన్ని ఇప్పుడు ఈ భామ స‌ద్వినియోగం చేసుకొని ఇప్పుడు వ‌రుస సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ఇప్పుడు వైష్ణ‌వి రెండు లేదా మూడు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

వైష్ణ‌వి చైత‌న్య‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో పాటు, టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫుల్ ఫేమ‌స్ తెచ్చుకుంది. ఈమెలోని టాలెంట్‌ని సాయి రాజేష్ గుర్తించి మంచిగా ఉప‌యోగించుకున్నాడు. వైష్ణ‌వి న‌ట‌న‌కి ఫిదా కాని వారు లేరు. అయితే రీసెంట్‌గా వైష్ణ‌వి చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను ప‌డ్డ బాధ‌ల గురించి చెబుతూ ఎమోష‌న‌ల్ అయింది. ప‌దో త‌ర‌గ‌తి నుండే ఎన్నో బాధ‌లు ప‌డ్డ‌ట్టు చెప్పిన వైష్ణవి చైత‌న్య‌.. ఫ్యామిలీ బాధ్య‌త‌లని తీసుకున్న‌ట్టు పేర్కొంది. పూట గ‌డ‌వ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డేదానిని అని పేర్కొంది.

బ‌ర్త్ డేలకి, పెళ్లిళ్ల ఈవెంట్ల‌కి రాత్రిళ్లు వెళ్లి డ్యాన్స్‌లు చేసే దానిని అని కూడా వైష్ణ‌వి పేర్కొంది. బ‌ర్త్ డే పార్టీల‌కి రాత్రిళ్లు వెళ్లి డ్యాన్స్ చేస్తే రూ.700లు ఇచ్చే వార‌ని, ఆ మ‌నీతో అమ్మ రైస్ కొనుక్కొచి మా కడుపు నింపేద‌ని వైష్ణ‌వి చాలా ఎమోష‌న‌ల్‌గా పేర్కొంది. అయితే యూట్యూబ్ వీడియోలు చేసే స‌మ‌యంలో డ్రెస్ చేంజ్ చేసుకోవాల‌న్నా కూడా స‌ప‌రేట్ గ‌ది ఉండేది కాద‌ని వాష్ రూమ్‌లో చేంజ్ చేసుకోవ‌ల్సి వ‌చ్చేద‌ని తెలియ‌జేసింది. నా బాధ‌లు చూసి అమ్మ చాలా ఏడ్చేసింది. ఓ మూవీలో చిన్న పాత్ర చేయ‌గా, ఆ స‌మ‌యంలో వాష్ రూం కోసం కార్ వ్యాన్ వాడుకోవ‌చ్చా అని అడిగితే అన‌రాని మాట‌లు అన్నారంటూ వైష్ణ‌వి చాలా బాధ‌తో చెప్పుకొచ్చింది. ఆమె మాట‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి

Ramu

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp