Vaishnav Tej Gets Problems Like Allu Sirish
Vaishnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెనలా దూసుకొచ్చిన కుర్ర హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం చేశాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేతికా శర్మ గ్లామర్, భారీ ప్రమోషన్లు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే కథ, కథనాలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఉండటంతో ప్రేక్షకులు, సినిమా విమర్శకులు పెదవి విరిచారు. ఉప్పెన మొదటిరోజు కలెక్షన్స్ లో సగం కూడా ఫుల్ రన్ లో రంగ రంగ వైభవంగా చిత్రానికి దక్కలేదు.
వైష్ణవ్ రెండో చిత్రం కొండపొలం , మూడో చిత్రం రంగరంగ వైభవంగా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు వైష్ణవ్ కెరియర్ పై అయోమయమైన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ రెండు చిత్రాల్లో వైష్ణవ్ నటన విమర్శల పాలవుతుంది. ఈ క్రమంలో ఉప్పెన గాలివాటం హిట్ తప్పితే వైష్ణవ్ టాలెంట్ గా చెప్పలేం అంటున్నారు. దేవిశ్రీ పాటలు, కృతి గ్లామర్, విజయ్ సేతుపతి నటన ఆ చిత్రాన్ని నిలబెట్టాయి. ఆ విధంగా ఉప్పెన భారీ విజయం సాధించింది అంటున్నారు. ఈ విజయంలో వైష్ణవ్ పాత్ర ఏమీ లేదని రెండు పరాజయాల తర్వాత జనాలు తేల్చేశారు.
Vaishnav Tej Gets Problems Like Allu Sirish
కొందరు యాంటీ ఫ్యాన్స్ వైష్ణవ్ తేజ్ నటుడిగా పరిశ్రమలో నిలబడడం కష్టమే అంటున్నారు. నటన పరంగా వైష్ణవ్ మెచ్యూరిటీ సాధించి ప్రేక్షకులను మెప్పిస్తే మినహా రాణించడం కల్ల అనే వాదన వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో అల్లు శిరీష్ కూడా సినిమాలు చేసిన పెద్దగా రాణించలేదు. ఆయన మాదిరిగానే వైష్ణవ్ పరిస్థితి అవుతుందేమోనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రంగ రంగ వైభవంగా సినిమా 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సెలవు దినం రోజున ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా 3 రోజున ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారు 3 కోట్ల షేర్, 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం.. ఈ చిత్రం ఇంకా 6 కోట్లకుపైగానే లాభాలను రాబట్టాల్సి ఉంటుంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.