Vaishnav Tej : వైష్ణ‌వ్ తేజ్ ప‌రిస్థితి అల్లు శిరీష్ మాదిరిగానే అవుతుందా.. గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మేనంటున్నారే..!

Authored By Sam C | The Telugu News | Published on: September 7, 2022, 2:00 pm

Vaishnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన‌లా దూసుకొచ్చిన కుర్ర హీరో వైష్ణ‌వ్ తేజ్. ఉప్పెన సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వైష్ణ‌వ్ తేజ్ ఆ త‌ర్వాత కొండపొలం చేశాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేతికా శర్మ గ్లామర్, భారీ ప్రమోషన్లు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే కథ, కథనాలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఉండటంతో ప్రేక్షకులు, సినిమా విమర్శకులు పెదవి విరిచారు. ఉప్పెన మొదటిరోజు కలెక్షన్స్ లో సగం కూడా ఫుల్ రన్ లో రంగ రంగ వైభవంగా చిత్రానికి దక్కలేదు.

Vaishnav Tej : దారుణంగా మారిన వైష్ణ‌వ్ పరిస్థితి..

వైష్ణవ్ రెండో చిత్రం కొండపొలం , మూడో చిత్రం రంగ‌రంగ వైభ‌వంగా దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు వైష్ణవ్ కెరియ‌ర్ పై అయోమ‌యమైన ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ రెండు చిత్రాల్లో వైష్ణవ్ నటన విమర్శల పాలవుతుంది. ఈ క్రమంలో ఉప్పెన గాలివాటం హిట్ తప్పితే వైష్ణవ్ టాలెంట్ గా చెప్పలేం అంటున్నారు. దేవిశ్రీ పాటలు, కృతి గ్లామర్, విజయ్ సేతుపతి నటన ఆ చిత్రాన్ని నిలబెట్టాయి. ఆ విధంగా ఉప్పెన భారీ విజయం సాధించింది అంటున్నారు. ఈ విజయంలో వైష్ణవ్ పాత్ర ఏమీ లేదని రెండు పరాజయాల తర్వాత జనాలు తేల్చేశారు.

Vaishnav Tej Gets Problems Like Allu Sirish

Vaishnav Tej Gets Problems Like Allu Sirish

కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ వైష్ణ‌వ్ తేజ్ నటుడిగా పరిశ్రమలో నిలబడడం కష్టమే అంటున్నారు. నటన పరంగా వైష్ణవ్ మెచ్యూరిటీ సాధించి ప్రేక్షకులను మెప్పిస్తే మినహా రాణించడం కల్ల అనే వాదన వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో అల్లు శిరీష్ కూడా సినిమాలు చేసిన పెద్ద‌గా రాణించ‌లేదు. ఆయ‌న మాదిరిగానే వైష్ణ‌వ్ పరిస్థితి అవుతుందేమోన‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రంగ రంగ వైభవంగా సినిమా 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సెలవు దినం రోజున ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా 3 రోజున ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారు 3 కోట్ల షేర్, 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం.. ఈ చిత్రం ఇంకా 6 కోట్లకుపైగానే లాభాలను రాబట్టాల్సి ఉంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp