Vakeel Saab : వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో మేకర్స్ పనుల్లో స్పీడ్ పెంచారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. దాదాపు సంవత్సరం ఆలస్యంగా రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ సినిమా మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హిందీలో పింక్ గా.. తమిళంలో నేర్కొండ్ అపార్వైగా వచ్చినప్పటికి తెలుగు వకీల్ సాబ్ మీద పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బోనీకపూర్ సమర్పణలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్ చేస్తుండగా నివేదా థామస్ .. అనన్య నాగళ్ళ .. అంజలి.. కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ లాయర్స్ గా కీ రోల్ లో కనిపించబోతున్నారు. ఇక మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం తో దిల్ రాజు నిర్మాణం పరంగా ఎక్కడా కాంప్రైజ్ కావడం లేదు. రీమేక్ సినిమా అయినప్పటికి పవర్ స్టార్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు.
thaman is not going to get compromised regarding vakeel-saab
కాగా థమన్ కూడా ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బం ఇచ్చేందుకు బాగానే కష్టపడుతున్నాడట. ఇప్పటికే థమన్ కంపోజ్ చేసిన ‘మగువా మగువా’ సాంగ్ అందరినీ విపరితంగా ఆకట్టుకుంది. దాంతో త్వరలో సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు వకీల్ సాబ్ లో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం లో థమన్ ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటున్నాడట. తన టీం తో వకీల్ సాబ్ కి మంచి సాంగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడట. తాజాగా తన మ్యూజిక్ కంపోజర్స్ తో ఉన్న ఫొటో ని షేర్ చేస్తూ థమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మధ్య ఫుల్ ఫాం లో ఉన్న థమన్ వకీల్ సాబ్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.