Home » Entertainment » Vantalakka Comments On Karthika Deepam
Entertainment

Karthika Deepam : ఇక వంటలక్క పాత్ర చేయాను.. దీప సంచలన వ్యాఖ్యలు..!

Authored By
praveen T
The Telugu News | Published on: October 7, 2021, 3:40 pm
Advertisement

Karthika Deepam : ఉభయ తెలుగు రాష్ట్రాలలో ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సీరియల్‌లోని వంటలక్క క్యారెక్టర్‌కు అభిమానులు బోలెడు మంది ఉన్నారు. వంటలక్క పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొంది, తెలుగు ఇంటి ఆడపడచుగా మారిపోయింది ప్రేమి విశ్వనాథ్. తాజాగా సీరియల్‌లోని ‘దీప’ పాత్రపై ప్రేమి విశ్వనాథ్ సంచలన కామెంట్స్ చేసింది.

Advertisement

Vantalakka comments on Karthika Deepam

Karthika Deepam  ఆ పాత్ర ఇష్టం లేదు..

‘కార్తీక దీపం’ సీరియల్‌లో తొలుత తాను నటించకూడదని అనుకున్నానని, కానీ తప్పక నటించానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ కోసం డైరెక్టర్ రాజేంద్ర తనను అడిగారని, అయితే, తనకు తెలుగు రాదని, అందుచేత సీరియల్‌లో నటించనని చెప్పానని పేర్కొంది. అయితే, ఆ తర్వాత డైరెక్టర్ ఒప్పించగా సీరియల్‌లో నటించానని తెలిపింది.

Advertisement

karthika deepam 7 october 2021 latest episode

ఇక ఇప్పుడు తనను మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువ మంది ప్రేక్షకులు గుర్తిస్తున్నారని చెప్పింది. తనకు స్టార్ డమ్ లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది ప్రేమి. బుల్లితెరపై వంటలక్కగా సందడి చేసిన ప్రేమి విశ్వనాథ్ త్వరలో వెండితెరపైన కూడా సందడి చేయబోతున్నది. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని- డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్ర పోషించబోతున్నదని తెలుస్తోంది.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి