Sudigali Sudheer : అందరూ కలిసి సుడిగాలి సుధీర్‌ను అవమానిస్తున్నారు.. చివరకు వర్ష కూడా మొదలెట్టేసిందిగా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 29 April 2022, 10:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ ఫాలోయింగ్ ముందు బుల్లితెర తారలెవ్వరూ సాటిరారు. చిన్న స్థాయి నుంచి ఎదిగిన సుధీర్‌కు ఇప్పుడు స్టార్డంతో దూసుకుపోతోన్నాడు. అయితే సుధీర్‌ను బుల్లితెరపై అందరూ సెటైర్లు వేస్తుంటారు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో సుధీర్ మీద కౌంటర్లు వేస్తుంటారు. అందరూ సుధీర్‌ను వ్యక్తిగతంగా చురకలు అంటిస్తుంటారు.శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ఇంతలా హిట్ అవ్వడానికి కారణం సుధీర్. కానీ సుధీర్ హోస్టింగ్ మీదే అందరూ కౌంటర్లు వేస్తుంటారు.

సూపర్ సూపర్ సూపర్ అంటూ సుధీర్ తన స్టైల్లో చెప్పే డైలాగ్, చేసే యాంకరింగ్‌ను అందరూ గేలి చేస్తుంటారు. సుధీర్ హోస్టింగ్ మీద కౌంటర్లు వేస్తుంటారు. ఇందులో ఎక్కువగా అంటే యాంకర్ రష్మీ, పంచ్ ప్రసాద్, పొట్టి నరేష్ వంటి వారంతా సుధీర్ హోస్టింగ్ మీద కౌంటర్లు వేస్తుంటారు.తాజాగా వదిలిన ప్రోమోలో చివరకు వర్ష కూడా కౌంటర్లు వేసింది. ప్రతీ వారం ఏదో ఒక థీమ్‌తో శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను నడిపిస్తుంటారు. ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ మీదే థీమ్ సెట్ చేశారు. ఎవరికైనా లీజుకి ఇస్తే డబ్బులు వస్తాయ్..

Varsha Satires On Sudigali Sudheer In Sridevi Drama Company

Varsha Satires On Sudigali Sudheer In Sridevi Drama Company

అని దాంతో జీతాలు చెల్లించొచ్చు.. అందరికీ పని దొరుకుతుందంటూ సుధీర్, ఇంద్రజలు అనుకుంటారు. దీంతో ఈ కంపెనీని లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తమ తమ టాలెంట్‌ను చూపించమని అడుగుతారు.నీ సూపర్ వల్లే కదా? మన పరిస్థితి ఈడి వరకు వచ్చింది అంటూ సుధీర్ హోస్టింగ్ మీద కౌంటర్ వేస్తుంది వర్ష. నరేష్ కూడా పనిలోపనిగా సుధీర్ మీద కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి వర్ష, ఇమాన్యుయేల్ ఈ ప్రోమోలో వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి