Varshini : ఆ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన యాంకర్ వర్షిణి.. ఎందుకో తెలుసా?

Authored By mallesh | The Telugu News | Published on: December 19, 2021, 1:00 pm

Varshini : బుల్లితెరపై చలాకీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న వర్షిణి సౌందరాజన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బుల్లితెరపైన ‘పోవే పోరా’తో పాటు పలు కార్యక్రమాల్లో సందడి చేస్తోంది. సినిమా ఫంక్షన్స్‌లోనూ ఈ సుందరి యాంకరింగ్ చేస్తుంటుంది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను షేర్ చేసుకుంది వర్షిణి.బుల్లితెరపై కమెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌తో పాటు ఇతరులతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది వర్షిణి.

‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది వర్షిణికి జోడీగా ఉంటూ ఆటపట్టించడం ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంటుంది. ఇకపోతే ఈమె వెండితెరపైన ఎంట్రీ ఇవ్వాలని ఎ్పటినుంచో అనుకుంటుంది. ఇందుకుగాను తాను మోడలింగ్ చేసే సమయం నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో కనిపించిన వర్షిణి.. సరైన పాత్ర కోసం ఎదురు చూస్తోందని చెప్పొచ్చు.సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు చెప్తూ వాపోయింది వర్షిణి. టాలీవుడ్ కు చెందిన ఓ దర్శకుడు తన సినిమాలో చాన్స్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని అంది. సినిమా కోసం సైన్ చేయాలని తన ఇంటికి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ క్రమంలోనే తనను బెడ్ మీదకు లాగబోయాడని పేర్కొంది వర్షిణి.

varshini  sensational comment on that tollywood director

varshini  sensational comment on that tollywood director

Varshini : ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొన్న వర్షిణి..

దాంతో తాను వెంటనే ఆ దర్శకుడి చెంప చెల్లుమనిపించానని తెలిపింది. అయితే, ఆ డైరెక్టర్ పేరు తాను చెప్పలేనని అంది. ఇకపోతే యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అలా తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుండటంతో పాటు నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది ఈ భామ.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp