Varshini Sounderajan : వర్షిణి ఫ్యాన్స్ హంగామా.. మొత్తానికి అలా కనిపించింది

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 29 October 2021, 8:40 pm

Varshini Sounderajan : యాంకర్ వర్షిణి బుల్లితెరను వదిలేసి వెండితెరకు జంప్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు యూట్యూబ్, ఓటీటీ అంటూ వర్షిణి ఫుల్ ఫేమస్ అయింది. ఆమె చేసిన పెళ్లి గోల వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ తరువాత వర్షిణి బుల్లితెర మీద ఫిక్స్ అయింది. అక్కడ కొన్ని రోజులు పటాస్, ఢీ, జబర్దస్త్ అంటూ ఫుల్లుగా ఫేమస్ అయింది. చివరకు ఢీ షోలో ఆది, వర్షిణి జోడి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఢీ నుంచి వర్షిణి వెళ్లిపోయింది. కొత్త సీజన్ అంటూ కొత్త అమ్మాయి దీపిక పిల్లిని తీసుకొచ్చారు.

varshini sounderajan in sumanth malli modalaindi trailer

varshini sounderajan in sumanth malli modalaindi trailer

అలా వర్షిణి మొత్తానికి ఢీ నుంచి బయటకు వచ్చింది. కొన్ని రోజులు ఖాళీగానే ఉంది. అయితే కామెడీ స్టార్స్ అనే షోకు సింగిల్ యాంకర్గా మారింది. అది కూడా కొన్ని రోజులే చేసింది. మళ్లీ వెంటనే అక్కడి నుంచి కూడా గాయబ్ అయింది. అయితే సినిమా ఆఫర్లు రావడంతోనే కామెడీ స్టార్స్‌ను వదిలేసిందని టాక్ వచ్చింది. అయితే సమంత గుణ శేఖర్ శాకుంతలం సినిమాలో మంచి రోల్ వచ్చిందని, సుమంత్ మళ్లీ మొదలైంది చిత్రంలో లెంగ్తీ రోల్ అని అన్నారు.

Varshini Sounderajan మళ్లీ మొదలైందిలో వర్షిణి

varshini sounderajan in sumanth malli modalaindi trailer

varshini sounderajan in sumanth malli modalaindi trailer

అయితే దానికి తగ్గట్టే ఇప్పుడు ట్రైలర్‌లో వర్షిణి హైలెట్ అయింది. సెకండ్ హీరోయిన్‌గా వర్షిణి కనిపించింది. సుమంత్‌కు మొదటి భార్యగా వర్షిణి కనిపించింది. డైవర్స్ తీసుకుంటే సమాజం ఎలాంటి మాటలు అంటుంది.. ఎలాంటి మాటలను మాట్లాడుతుందో చూపించారు. ఈ ట్రైలర్‌లో వర్షిణిని అందరూ ఫిదా అవుతున్నారు. ఇక వర్షిణి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా హిట్ కావాలని, సుమంత్‌కు మంచి పేరు రావాలి, వర్షిణికి ఇంకా ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి