varun dhawan security for samantha
Samantha : టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ప్రస్తుతం సమంత ఏ పని చేసిన కూడా సెన్సేషన్‌గా మారుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, సోషల్ మీడియా, టూర్స్ ఇలా పలు విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత బాలీవుడ్‌లోను అదరగొడుతుంది. సిటడెల్ అనే వెబ్‌సిరీస్ కోసం సమంత, వరుణ్ ధావన్ జత కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ టీం గత రాత్రి సమావేశమాయ్యారు. మీటింగ్ అనంతరం సమంత, వరుణ్ తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో ఫోటో జర్నలిస్టులు తెగ హడావిడి చేశారు. ఫోటోల కోసం చుట్టుముట్టడంతో ఆ ఫోటోగ్రాఫర్ల నుంచి వరుణ్ సమంతను కాపాడారు.
ఫ్యాన్స్‌ను, జర్నలిస్టుల ను పక్కకు వెళ్లమంటూ సముదాయించాడు. హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి ఆమెను’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. అనంతరం సామ్‌ను సేఫ్‌గా కారు వరకు వరుణ్ తీసుకెళ్లారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్ హీరోలా మాత్రమే కాదు రియల్ హరోగా బిహేవ్ చేశాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
varun dhawan security for samantha
ఇక వెబ్ సిరీస్ విషయానికొస్తే.. మార్వెల్ సినిమాల రూపకర్తలు రూసో బ్రదర్స్ హాలీవుడ్ లో ‘సిటాడెల్’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ఇండియన్ వెర్షన్ నే వెబ్ సిరీస్‌గా రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు. మరోవైపు సమంత నటించిన శాకుంతలం చిత్రం విడుదలకి సిద్ధం కాగా, యశోద చిత్రం షూటింగ్ దశలో ఉంది. తమిళ చిత్రం కూడా విడుదల కావలసి ఉంది. మరోవైపు ఈ అమ్మడి ఖాతాలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తుంది. కాగా, ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇందులో రాజీ అనే ఎల్‌టీటీఈ రెబెల్ పాత్రలో అద్భుత నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిరీస్ కూడా సూపర్ హిట్ కావడంతో సామ్ కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
This website uses cookies.