Varun Tej – Lavanya Tripathi Reception : గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఫోటోలు వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 6, 2023, 4:00 pm
  •  వరుణ్, లావణ్య రిసెప్షన్ లో చిరంజీవి సందడి

  •  దిల్ రాజు, సుకుమార్ ఫ్యామిలీ సందడి

  •  స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేశ్

Varun Tej – Lavanya Tripathi Reception : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. వీళ్ల పెళ్లికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, ఇతర సన్నిహితులు తప్పితే ఇంకెవ్వరూ వెళ్లలేదు. అయితే.. సినిమా, ఇతర ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ వేడుక కాబట్టి ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి దాదాపుగా అందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, సుకుమార్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నవదీప్, బిగ్ బాస్ వితిక, రీతు వర్మ, బెల్లంకొండ ఫ్యామిలీ, దిల్ రాజు ఫ్యామిలీ, నాగ చైతన్య, ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే.. వరుణ్ పెళ్లికి పవన్ కళ్యాణ్ ఇటలీకి వెళ్లడంతో రిసెప్షన్ కు హాజరు కాలేదు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ సూట్ లో వరుణ్ తేజ్, లైట్ గోల్డ్ కలర్ శారీలో లావణ్య మెరిసిపోయారు. కొత్త పెళ్లి కూతురు అయితే చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp