Lavanya Tripathi – Varun Tej : ఇంకా మెడలో తాళి పడకుండా నే లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం – ఉలిక్కిపడ్డ వరుణ్ తేజ్ !
Lavanya Tripathi – Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. మనకు తెలిసిందే వీరిద్దరూ కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. కానీ వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎంతో సైలెంట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అలాగే ఎంతో సైలెంట్ గా కనిపించే లావణ్య మెగా కోడలు అవుతుందా అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే వరుణ్ తో వివాహం తర్వాత లావణ్య యధావిధిగా సినిమాలు చేస్తుందా లేక కుటుంబానికి అంకితం అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం లావణ్య చేతిలో ఏ సినిమాలు లేనట్టు కనిపిస్తుంది. తమిళ్ లో మాత్రం తానల్ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తప్ప మరో కొత్త సినిమాకి లావణ్య ఓకే చేయలేదు. ఈ క్రమంలోనే లావణ్య కావాలనే కొత్త సినిమాలకు సంతకం చేయలేదా లేక అవకాశాలు రాకనా అనే సందేహం వస్తుంది. మరి పెళ్లి తర్వాత లావణ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటివరకైతే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క నిహారిక మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది.
పెళ్లి తర్వాత కేవలం నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లో చేస్తుంది. అయితే హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకే నిహారిక సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుందని అంటున్నారు. మరి నిహారిక లాగే లావణ్య కూడా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క నిహారిక మాత్రమే ఇండస్ట్రీ లోకి వచ్చింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బ్యాకెండ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. అంతేకానీ ఎప్పుడు సినిమాలో నటించే ప్రయత్నం చేయలేదు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా సినిమాలోకి రాలేదు. ఇక మెగా కోడలు ఉపాసన కూడా బిజినెస్ వుమెన్ గానే కొనసాగుతున్నారు.