Lavanya Tripathi : వ‌రుణ్ తేజ్‌తో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుందా.. క్లారిటీ ఇచ్చిన లావ‌ణ్య త్రిపాఠి

Authored By Sam C | The Telugu News | Published on: July 6, 2022, 12:00 pm

Lavanya Tripathi : సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌లో ఏది నిజం, ఏది అబ‌ద్ధం చెప్ప‌డం చాలా క‌ష్టం. కొద్ది రోజులుగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల ప్రేమ, పెళ్లి రూమర్స్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ మారాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. లావణ్య ఈ వార్తలపై పరోక్షంగా స్పందించినప్పటికి, నేరుగా ఇంతవరకు వరుణ్‌ తేజ్‌ కానీ, లావణ్య కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. లావణ్య త్రిపాఠి `అందాల రాక్షసి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో తన మార్క్ ని చాటుకుంది.

అందరికి నోటెడ్‌ అయ్యింది. జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తూ, మంచి పాత్రలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. లావ‌ణ్య న‌టించిన తెలుగు మూవీ `హ్యాపీబర్త్ డే` ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఈక్ర‌మంలో రూమర్లపై స్పందించింది. మ్యారేజ్‌ రూమర్స్ తనని ఆశ్చర్యపరిచినట్టు తెలిపింది. ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, సాయంత్రం మ్యారేజ్‌ జరగబోతుందని రూమర్స్ వైరల్‌ అయ్యాయి. వాటిపై ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో లేనని తెలిపింది. వాట‌న్నింటిని తాను జస్ట్‌ లైట్‌ తీసుకున్నట్టు వెల్లడించింది లావణ్య త్రిపాఠి. అయితే ఎంగేజ్ మెంట్‌ కూడా అయ్యిందనేదానిపై చెబుతూ, తన వేలికి ఉన్న రింగ్‌ తానే సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నానని,

Varun Tej going to get married Lavanya Tripathi gave clarity

Varun Tej going to get married Lavanya Tripathi gave clarity

Lavanya Tripathi : ఇలా క్లారిటీ ఇచ్చేసింది..

ఎవరూ కోనివ్వలేదని, తనకెవరూ పెట్టలేదని కౌంటరిచ్చింది. ఈ తరహా సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇందులో నా పాత్ర, సినిమా నేపథ్యం, మేకింగ్‌లో ఉపయోగించిన టెక్నాలజీ అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ చిత్రంలో నటించడాన్ని ఆస్వాదించాను. జిమ్‌లో కిక్‌ బాక్సింగ్‌ లాంటివి చేస్తుంటా. కానీ తెరపై యాక్షన్‌ చేయడం ఇదే తొలిసారి.  కాగా వరుణ్‌ సోదరి, నటి నిహారిక, లావణ్యలు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక వ‌రుణ్‌, లావ‌ణ్య ఇద్ద‌రూ ‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ చిత్రాల్లో న‌టించారు. ఆ సినిమాల స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ల‌వ్‌లో ప‌డ్డార‌ని, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp