
veerendra chowdary reacts on namitha sarath babu relation
Namitha: బొద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచింన నమిత ఆ తర్వాత ‘సొంతం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్ సరసన ‘జెమినీ’ మూవీలో నటించి మరింత పాపులర్ అయ్యింది. ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’, ‘నాయకుడు’ వంటి పలు చిత్రాల్లో నటించింది నమిత. బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి .ప్రభాస్ ‘బిల్లా’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నమిత.. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించింది.
2017లో వీరేంద్ర చౌదరిని లవ్ మ్యారేజ్ చేసుకుని వైవాహిక జీవితానికి ఆరంభం పలికింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భౌవౌ అనే సినిమా చేస్తోంది. అయితే నమిత పెళ్లి తర్వాత పలు పుకార్లు చక్కర్లుకొడుతున్నాయి. సీరియల్ నటుడు శరత్ బాబుతో నమిత పెళ్లని.. ఆ వృద్ధ నటుడితో పీకల్లోతు ప్రేమలో ఈ యంగ్ బ్యూటీ ఉందని అప్పట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్‌పై నమిత భర్త వీరేంద్ర చౌదరి స్పందించారు.పెళ్లైన తరువాత నమిత నాతోనే ఉంటుంది.. నేనేంటో తనకి తెలుసు.. తనేంటో నాకు తెలుసు.. ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయని నవ్వుకుంటూ ఉంటాం.
veerendra chowdary reacts on namitha sarath babu relation
నమిత కూడా పెద్దగా పట్టించుకోదు. రూమర్స్ అన్నింటిలోనూ వరస్ట్ రూమర్ ఏంటంటే.. శరత్ బాబుతో నమిత పెళ్లి అనే రూమర్. మా పెళ్లి టైంలోనే సీనియర్ నటుడు శరత్ బాబుతో నమిత పెళ్లి అని చాలా గాసిప్స్ వచ్చాయి. దాన్ని మేం అంత సీరియస్‌గా తీసుకోలేదు . నాకు తెలిసి ఆయన కూడా ఈ రూమర్‌పై బాధపడి ఉంటారు. ఆయన చాలా పెద్దాయన.. సీనియర్ నటుడు.. అలాంటి వ్యక్తితో ఎఫైర్ అని రూమర్లు క్రియేట్ చేయడం చాలా తప్పు. ఇవి వారి వ్యక్తిగత జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని వారు గ్రహించలేకపోతున్నారు అని వీరేంద్ర చౌదరి తెలియజేశాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.