Home » Entertainment » Venkatesh Second Daughter Engagement
Entertainment

Venkatesh Daughter Engagement : గ్రాండ్ గా వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థం .. సందడి చేసిన స్టార్ సెలబ్రిటీలు ..!

Authored By
Anusha V
The Telugu News | Published on: October 26, 2023, 8:00 pm
Advertisement

Venkatesh Daughter Engagement : విక్టరీ వెంకటేష్ రెండవ కుమార్తె హయవాహిని పెళ్లికి సిద్ధం అవుతుంది. దీంతో దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. విజయవాడకు చెందిన వైద్యుడు కుటుంబానికి ఆమె కోడలు కాబోతుంది. విజయవాడలో నిశ్చితార్థ వేడుక జరిగిందని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి శైలేష్ కొనలు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. హైదరాబాద్ కి చెందిన రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి తో ఆశ్రిత వివాహం 2019లో జైపూర్లో ఘనంగా జరిగింది.

Advertisement

ప్రస్తుతం ఆ దంపతులు స్పేర్ లో ఉన్నట్లు సమాచారం. ఇక వెంకటేష్ మూడవ కుమార్తె భావన, అర్జున్ విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. మరోవైపు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ వివాహం కూడా త్వరలోనే జరగనుందని సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్ తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతారు. ఇప్పటివరకు వెంకటేష్ భార్య నీరజ ఎవరో కూడా చాలామందికి తెలియదు. పిల్లలను నటనలోకి తీసుకురావాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. వారికి నచ్చిన రంగంలో వారిని ఎదగాలని అనుకున్నాడు.

ఇక వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థానికి స్టార్ సెలబ్రెటీలు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీసమేతంగా వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థం హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ‘ సైంధవ్ ‘ అనే సినిమాలో నటిస్తున్నారు. గత సినిమా ఎఫ్ 3 తో ప్రేక్షకులను నవ్వించిన విక్టరీ ఈసారి సీరియస్ పాత్రలో యాక్షన్ సీక్వెన్స్ తో ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎటువంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి