rgv controversial speech at apsara rani movie trailer launch
Ram Gopal Varma : ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ.. ఈ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్లు ఇంకో ఇద్దరో ముగ్గురో ఉంటే ఇండస్ట్రీ ఇలా ఉండదు. ఆర్జీవీ మాట్లాడే మాటలు కానీ.. ఆయన ఆలోచించే విధానం కానీ.. అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఎంత కొత్తగా అంటే.. రామ్ గోపాల్ వర్మ అసలు ఇలా కూడా ఆలోచిస్తారా? ఇలాంటి ఆలోచనలు మనకెందుకు రావు అనేంతగా ఉంటాయి. అందుకే ఆర్జీవీ ఇండస్ట్రీలో స్పెషల్ పర్సన్ అయ్యారు. ఆర్జీవీ గురించి ఈ తరం వారికి తెలిసింది కేవలం యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూలు చూసి. కానీ.. 80, 90 దశకాలకు చెందిన వాళ్లను అడిగితే చెబుతారు. ఆర్జీవీకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో. ఆయన క్రేజ్ ఇప్పుడు తగ్గింది కానీ.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇక.. అసలు విషయానికి వస్తే.. అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించిన తలకోన అనే సినిమా ట్రెయిలర్ లాంచ్ కి డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే.. నేను అసలు మంచి సినిమాలు తీయడానికి రాలేదు అని. నేను ఏమంటున్నాను అంటే.. అసలు నేను నిజంగానే మంచి సినిమాలు తీయడానికి రాలేదు. కానీ.. కొన్ని మంచి సినిమాలు అయ్యాయి. ఫస్ట్ నుంచి బలమైన మగవాళ్లు, అందమైన ఆడవాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. బలమైన మగవాళ్లు అంటే యాక్షన్, అందమైన అంటే బ్యూటీ. ఈ తలకోన సినిమాలో అప్సర రాణి.. బలమైన యుద్ధాలు కూడా అప్సర చేసింది. అందమైన అమ్మాయి కూడా అప్సర. అంటే ఈ రెండు కలిపితే అప్సర కనిపించింది నాకు. ఒక దట్టమైన అడవిలో తలకోన సినిమా నేపథ్యం నడుస్తుంది కాబట్టి.. నాకు అడవి అంటే చాలా ఇష్టం.. అంటూ వర్మ చెప్పుకొచ్చారు.
తలకోన మూవీ ట్రెయిల్ లాంచ్ లో వర్మ జోక్స్ కూడా వేశాడు. తలకోన టైటిల్ ఉందని అందరూ జంతువుల్లా అరుస్తున్నారా? అంటూ వర్మ పంచులు పేల్చాడు. ఈ సినిమా సక్సెస్ సాదించాలని.. ఈ సినిమాలో అప్సర చాలా బ్యూటిఫుల్ గా ఉందని.. తన వల్లనే ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉందని ఆర్జీవీ స్పష్టం చేశారు. అప్సర నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ అప్సరకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆర్జీవీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.