
vennela marriage fixes again and vennela is in depression
Janaki Kalaganaledu 7 Feb Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 7 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 231 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కుల దేవత దగ్గరికి వెళ్లి పూజ చేసి రావాలని రామా, జానకికి చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అంటారు. మేము కూడా వెళ్తాం అని మల్లిక అంటుంది. దీంతో పూజారి గారు.. రామా, జానకిని వెళ్లమన్నారు కదా. మీరు తర్వాత వెళ్దురు అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో మల్లికకు కోపం వస్తుంది. రామా, జానకి వెళ్తే నేను ఎందుకు ఉండాలి. నేను కూడా వెళ్లిపోతా. మా ఇంటికి వెళ్లిపోతా అని విష్ణుతో అంటుంది.
vennela marriage fixes again and vennela is in depression
వెంటనే ఒక ప్లాన్ వేస్తుంది. తన నానమ్మకు బాగోలేనట్టుగా తన ఫ్రెండ్ తో జ్ఞానాంబకు ఫోన్ చేయిస్తుంది మల్లిక. అది నిజమే అనుకొని.. మీ నానమ్మకు బాగోలేదట.. ఇంటికి వెళ్లు. విష్ణును తీసుకొని వెళ్లు అని మల్లికకు చెబుతుంది జ్ఞానాంబ. తన ప్లాన్ సక్సెస్ అవడంతో సంతోషంలో ఉంటుంది మల్లిక. మరోవైపు మల్లిక నానమ్మ ఆరోగ్యంగానే ఉంటుంది. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుంది. ఆ తర్వాత తను ఇంటికి వెళ్లిపోతుంది. మరోవైపు రామా, జానకి.. కుల దేవత దగ్గరికి వెళ్లేందుకు బట్టలు సర్దుకుంటూ ఉంటారు. జానకి తన బట్టలు, రామా బట్టలను ఒకే బ్యాగ్ లో సర్దుతుండగా రామా వస్తాడు.
తన బట్టలను రామా.. జానకి బ్యాగులో పెట్టకుండా.. తాను సపరేట్ గా బ్యాగ్ లో పెట్టుకుంటాడు. దీంతో జానకికి కోపం వస్తుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ బ్యాగులో ప్లేస్ ఉంది కదా. ఎందుకు ఇందులో పెట్టడం లేదు. మీకు నా మీద ఎందుకు కోపం వస్తుంది అని ప్రశ్నిస్తుంది జానకి.
అయినా కూడా రామా ఏం మాట్లాడడు. నేను ఎందుకు ఐపీఎస్ కలను వదులుకోవాల్సి వచ్చిందో కూడా నేను చెప్పాను కదా. అయినా కూడా మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది జానకి. అయినా కూడా రామా ఏం మాట్లాడడు.
ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. ఏం కాలేదు అంటాడు ఇద్దరు. కులదేవత కోసం ప్రసాదం వండి తీసుకొస్తుంది జ్ఞానాంబ. దాన్ని పూజ మొత్తం పూర్తయ్యాక కులదేవతకు ఖచ్చితంగ నైవేద్యంగా సమర్పించాలి అని చెబుతుంది జ్ఞానాంబ.
ఒకవేళ ఈ ప్రసాదాన్ని కులదేవతకు నైవేద్యంగా సమర్పించలేకపోతే.. పూజ చేసిన ఫలితం దక్కదు అని మరీ చెబుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి సరే అంటుంది. ఆ తర్వాత రామా, జానకి ఇద్దరూ కలిసి కారులో కులదేవత మొక్కు కోసం వెళ్తుంటారు.
రామా మాత్రం జానకితో అస్సలు మాట్లాడడు. పాటలు పెట్టుకొని వింటూ ఉంటాడు. అది చూసి జానకికి కోపం వస్తుంది. పాటలు ఆపేస్తుంది. అయినా కూడా రామా మళ్లీ పాటలు పెట్టుకొని వింటూ ఉంటాడు. మరోవైపు జ్ఞానాంబకు రామచంద్రాపురం నుంచి వెన్నెలను చూసుకొని వెళ్లిన సుబ్బరాజు వాళ్లు ఫోన్ చేస్తారు.
మమ్మల్ని క్షమించండి. మీ సంబంధం వద్దు అనుకొని తప్పు చేశాం. ఎలాగైనా మీ కూతురును మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని కోరుతాడు. దీంతో మా వాళ్ల అందరితో కలిసి మాట్లాడి చెబుతా అంటుంది జ్ఞానాంబ. మా పెద్దబ్బాయి.. పెద్దకోడలు ఊరెళ్లారు. వాళ్లు వచ్చాక మాట్లాడి చెబుతా అంటుంది జ్ఞానాంబ.
మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటాడు సుబ్బరాజు. వెన్నెల.. రామచంద్రాపురం సంబంధం వాళ్లు ఫోన్ చేశారు. ఎల్లుండి నిశ్చితార్థం అంటున్నారని మీ నాన్న గారికి చెప్పు అంటుంది జ్ఞానాంబ. దీంతో వెన్నెల షాక్ అవుతుంది.
కట్ చేస్తే.. రామా, జానకి ఇద్దరూ కారును ఒకచోట ఆపుతారు. తన దగ్గర డబ్బులు లేవు అని తెలిసి కూడా రామా కాఫీ తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని.. తను ఇచ్చిన ఉంగరాన్ని తీస్తుంది జానకి. బాబు.. ఇది మా ఆయన నాకు ప్రేమగా ఇచ్చిన ఉంగరం. కాఫీకి ఇస్తున్నాను.. తీసుకో అంటుంది జానకి.
దీంతో ఇచ్చేయండి మేడమ్.. ఇచ్చేయండి అంటాడు ఆ వ్యక్తి. ఏయ్ నువ్వు ఆగు.. అంటాడు రామా. 20 రూపాయల కాఫీకి ఉంగరం ఇవ్వడం ఏంటి అంటాడు రామా. అయినా కూడా జానకి వినదు. అతడికి ఇచ్చేస్తుంది. దీంతో వెళ్లి జానకికి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు అతడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.