venu swamy comments on tollywood stars
Venu Swamy: సెలబ్రిటీలు, రాజకీయాల జీవితాలకు సంబంధించి ఏవో పిచ్చి జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తుంటాడు వేణు స్వామి. సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పడం అది నిజం కావడంతో మనోడు తెగ పాపులర్ అయ్యాడు. ఇక అప్పటి నుండి తన నోటికి వచ్చినవి ఏవో చెబుతూ వస్తున్నాడు. 2014 సమయంలో అనుకుంటాను.. కృష్ణ, విజయ నిర్మలగారి జాతకాలు చూసి, 2020లో మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెప్పాను. ఇద్దరిలో ఒకరు చనిపోతారని ఎప్పుడైతే ఓపెన్‌గా చెప్పానో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు అని అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్, శ్రీజ జాతకాలు ఒకటేనని, వారిద్దరి జాతకాల్లో కుజుడు నీచంలో ఉన్నాడని వేణు స్వామి అన్నారు.
పవన్‌కి నాలుగో పెళ్లి కూడా జరుగుతుందని, అలాగే శ్రీజ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసి మెగా అభిమానులతో చీవాట్లు తిన్నాడు. వైవాహిక జీవితంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, జేజమ్మ అనుష్క, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, అందాల ముద్దుగుమ్మ విజయం సాధించలేరని తెలిపారు. వీరిలో గురువు నీచంలో ఉన్నారని తెలిపారు. దీని వల్లనే వీరికి సంసార సుఖం ఉండదని తెలిపారు. అందుకే సమంతకు అలా జరిగిందని అంటున్నారు. ప్రభాస్‌కు కూడా గురువు నీచంలో ఉన్నారని తెలిపారు. దీంతో ఆయన సంసార జీవితం సరిగా ఉండదని తెలిపారు .ఇక కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రష్మిక ఎంపీగా పోటీ చేయనుందని వేణు స్వామి చెప్పారు. ఆమె జాతకంలో అలా రాసిపెట్టి ఉందని అన్నారు. ఇక తాజాగా మరో పెద్ద బాంబ్ పేల్చారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హీరోయిన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు త్వరలోనే చనిపోతారు అంటూ షాకిచ్చారు.
venu swamy comments on tollywood stars
దీంతో ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . కాగా వేణుస్వామి వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు స్పందించారు. సమంత నాగచైతన్య.. వాళ్ళది పర్సనల్ మ్యాటర్.. అసలు ఈ విషయం ఆయనకు అనవసరం లేదు.. వారి వ్యక్తిగత జీవితంలోకి తలదూర్చడానికి నువ్వు ఎవరు.. అంతేకాదు ఎవరోలో ఇండస్ట్రీలో ఏదో అవుతుంది అంటూన్నావ్ అది కరెక్టేనా” అంటూ ఆయన మాటలను తప్పుపట్టారు . ఇటీవల పాన్ ఇండియా స్టార్‌గా మారి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ఓ హీరో, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న టాప్ హీరోయిన్ త్వరలో చనిపోతారని వేణు స్వామి చెప్పాడు. దీంతో ఆయనని ఏకి పారేశారు ఇమ్మంది రామారావు. మార్కెట్‌లో తన స్ట్రాటజీ పెంచుకోవడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ మాటలను నమ్మద్దని.. ఈ వ్యాఖ్యలు తప్పు” అంటూ ఇబ్బంది రామారావు అభిప్రాయపడ్డాడు .
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.