Venu Swamy : వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆమెకి ఏకంగా రూ.50వేల సాయం
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల వేణు స్వామి తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు […]
ప్రధానాంశాలు:
Venu Swamy : వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆమెకి ఏకంగా రూ.50వేల సాయం
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల వేణు స్వామి తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి.
Venu Swamy గొప్ప సాయం..
నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దీనికి మూర్తి కూడా వేణు స్వామి కూడా గట్టిగా ఇచ్చి పడేశాడు. అయితే రాజకీయ, సినీ ప్రముఖుల జాతకాలు చెప్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గతంలో సమంత- నాగచైతన్య వివాహ బంధం గురించి చెప్పి ఎలా ఫేమస్ అయ్యాడో.. ఇప్పుడు నాగచైతన్య- శోభితా దూళిపాళ జాతకం చెప్పి అదే స్థాయిలో వివాదాల్లో ఇరుక్కున్నాడు.
నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత.. ఆ జంట ప్రయాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో.. వివాదాలన్నీ ఒక్కసారిగా ఆయణ్ని చుట్టుముట్టాయి. ముఖ్యంగా వేణు స్వామిపై ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భర్తను పోగొట్టుకున్న ఓ గర్భిణికి రూ.50 వేలు ఇచ్చి సహాయం చేశారు. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ “కృష్ణ అనే వ్యక్తి అనుకోని విధంగా అనారోగ్యం కారణంగా మరణించాడు. ఇంకొక వారంలో నిండు చూలాలైన అతడి భార్యకు డెలివరీ ఉంది. ఈ సమయంలో భర్తను కోల్పోయి కష్టాల పాలైన ఆమెకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది.” అని ఆమెకు ధైర్యం చెప్పారు.
ఒక అభాగ్యురాలికి 50 వేల రూపాయల సహాయం చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. pic.twitter.com/7Xf2gMP9qE
— ChotaNews (@ChotaNewsTelugu) September 9, 2024