Venu Swamy : నా మాటలకి కట్టుబడే ఉన్నాను… నాగచైతన్య- శోభితల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది ఇందుకే.. వీడియో !
Venu Swamy : వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.సమంత-నాగ చైతన్య జాతకంతో వార్తలలో నిలిచిన వేణు స్వామి రీసెంట్‌గా నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వేణు స్వామి నాగచైతన్య శోభిత దూళిపాళ్ల కలిసి ఉండరని, వారు విడాకులు తీసుకుంటారని, నాగచైతన్యకు సంతానం కలిగే అవకాశం లేదని వారిద్దరి జ్యోతిష్యాలను అనాలసిస్ చేసి చెప్పారు. అయితే వేణు స్వామి చేసిన తీవ్ర […]
ప్రధానాంశాలు:
Venu Swamy : నా మాటలకి కట్టుబడే ఉన్నాను... నాగచైతన్య- శోభితల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది ఇందుకే.. వీడియో !
Venu Swamy : వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.సమంత-నాగ చైతన్య జాతకంతో వార్తలలో నిలిచిన వేణు స్వామి రీసెంట్‌గా నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వేణు స్వామి నాగచైతన్య శోభిత దూళిపాళ్ల కలిసి ఉండరని, వారు విడాకులు తీసుకుంటారని, నాగచైతన్యకు సంతానం కలిగే అవకాశం లేదని వారిద్దరి జ్యోతిష్యాలను అనాలసిస్ చేసి చెప్పారు. అయితే వేణు స్వామి చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నాయి.
Venu Swamy యూ టర్న్..
పోలీస్ కమిషనర్, డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ తో పాటు మహిళా కమిషన్ కు కూడా వేణు స్వామి మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వైజే రాంబాబు తెలిపారు.అయితే ఈ సమయంలో వేణు స్వామి ఓ వీడియో విడుదల చేశాడు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ జాతకాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అనే విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. సమంత నాగ చైతన్య జాతకం చెప్పానని, దానికి కంటిన్యూగానే ఇది చెప్పానని అంతే గానీ వేరే ఉద్దేశం లేదని అన్నాడు. తాను ఇది వరకు చెప్పినట్టుగా సెలెబ్రిటీలు, పొలిటికల్ వ్యక్తుల జాతకాలు చెప్పనని అన్నాడు. ఈ విషయం మీద విష్ణు కూడా ఫోన్ చేశారని, ఆయనకు కూడా అదే విషయం చెప్పానని అన్నాడు.
మరోవైపు వేణు స్వామికి బిగ్ బాస్ లో చోటు ఇవ్వకూడదనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రమంలో నాగార్జున తనయుడు నాగ చైతన్య అక్కినేని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణు స్వామికి అవకాశం ఇవ్వకూడదని నాగచైతన్య అభిమానులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పై సంచలన వ్యాఖ్యలు చేసి చివరగా నా జాతకం తప్పు కావాలని కోరుకుంటున్నా అని వేణు స్వామి అన్న విషయం తెలిసిందే.
నా మాటకు ఇంకా నేను కట్టుబడే ఉన్నాను.
అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను.
దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభితల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది.
నేను సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను…మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు.
– వేణుస్వామి pic.twitter.com/LLKgJV0gzR— ChotaNews (@ChotaNewsTelugu) August 12, 2024