Venu Swamy : వేణుస్వామి బండారం బ‌య‌ట‌ప‌డింది… ప‌బ్లిక్‌గా మందేస్తూ దొరికిపోయాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : వేణుస్వామి బండారం బ‌య‌ట‌ప‌డింది… ప‌బ్లిక్‌గా మందేస్తూ దొరికిపోయాడు..!

Venu Swamy : సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఫుల్ ఫేమ‌స్ అయ్యాడు వేణు స్వామి. యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంత వరకు వేణు స్వామికి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. ఇటీవల కాలంలో వేణు స్వామి జాత‌కాలు పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్థిత్వానికే ముప్పు తెల్చేలా మారాయి. వేణు స్వామికి టాలీవుడ్ తో పరిచయాలు చాలా కాలంగా ఉన్నాయి. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణతో పాటు అనేక మంది టాలీవుడ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2024,4:11 pm

Venu Swamy : సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఫుల్ ఫేమ‌స్ అయ్యాడు వేణు స్వామి. యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంత వరకు వేణు స్వామికి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. ఇటీవల కాలంలో వేణు స్వామి జాత‌కాలు పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్థిత్వానికే ముప్పు తెల్చేలా మారాయి. వేణు స్వామికి టాలీవుడ్ తో పరిచయాలు చాలా కాలంగా ఉన్నాయి. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణతో పాటు అనేక మంది టాలీవుడ్ హీరోల సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు వేణు స్వామి చేతుల మీదగా జరిగాయి. సినిమా ఓపెనింగ్ సెరిమోని అంటే వేణు స్వామి ప్రత్యక్షం అయ్యేవాడు.

Venu Swamy దొరికిపోయాడుగా..

ఇటీవ‌ల చాలా మంది హీరోయిన్స్‌కి పూజ‌లు కూడా చేశాడు. అదృష్టం బాగోలేదు అని భావించిన హీరోయిన్స్ ప్ర‌త్యేకంగా వేణు స్వామిని క‌లిసి ఆయ‌న‌తో పూజ‌లు చేయించుకుంటున్నారు. వేణు స్వామి ఇటీవ‌ల చెప్పిన జాత‌కాల‌లో రేవంత్ రెడ్డీకి రాజయోగం లేదు. కేసీఆర్ తప్పకుండా మళ్లీ సీఎం అవుతాడని బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఎదురే లేదు. చంద్రబాబుకు ఇప్పట్లో మళ్లీ రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి కూడా లేదు అంటూ తనదైన శైలిలో జోస్యం చెప్పారు. ఇవ‌న్నీ కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి. అయితే ఏపీ ఎల‌క్ష‌న్స్ ఫ‌లితాల త‌ర్వాత తాను ప్ర‌ముఖుల గురించి జాత‌కాలు చెప్ప‌న‌ని అన్నాడు.

Venu Swamy వేణుస్వామి బండారం బ‌య‌ట‌ప‌డింది ప‌బ్లిక్‌గా మందేస్తూ దొరికిపోయాడు

Venu Swamy : వేణుస్వామి బండారం బ‌య‌ట‌ప‌డింది… ప‌బ్లిక్‌గా మందేస్తూ దొరికిపోయాడు..!

ఇక‌ వేణుస్వామి ఆదివారం రోజున బాగా ముస్తాబై.. కళ్లకు గాగుల్స్ పెట్టుకొని టింగురంగడిలా ప‌బ్ లో ద‌ర్శ‌నం ఇచ్చాడు. ఆయన పబ్‌లో దర్శనమిచ్చే సరికి అందరూ అవక్కాయ్యాడు. వెంటనే ఆయన ఫోటోలు సోషల్ మీడియాలోను, వాట్సాప్ గ్రూపుల్లోను చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. దాంతో ఆయన మరోసారి వైరల్ అయ్యాడు. ఒక పబ్లిక్ ఫిగర్ అందరికీ తెలిసేలా మందు కొట్టడం ఏమిటని కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. అయితే వేణు స్వామి గతంలోనే చెప్పాడు. నాకు మందు అలవాటు ఉంది. వీకెండ్ బార్ కి వెళ్లి మందు తాగుతాను అన్నారు. నా ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు. పూజలు చేసే మాకు వ్యక్తిగత జీవితం ఉండదా… అని ఓపెన్‌గా చెప్ప‌డం మ‌నం చూశాం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది